50శాతం సీట్లతో బస్సు ప్రయాణం

  • Published By: srihari ,Published On : May 19, 2020 / 01:35 AM IST
50శాతం సీట్లతో బస్సు ప్రయాణం

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు నడిపేందుకు ప్రభుత్వం అనుమతించింది. సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో జరిగిన క్యాబినెట్‌ సమావేశం తర్వాత రాష్ట్రంలో ఆర్టీసీబస్సులు ప్రారంభిస్తున్నట్టు  ప్రకటించారు. 50 శాతం సీట్లతో బస్సులను ఆర్టీసీ నడుపనున్నది. మంగళవారం నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 56 రోజుల విరామం తర్వాత మళ్లీ బస్సులు రోడ్డెక్కాయి. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలిస్తూ ఆర్టీసీ బస్సులు నడుపుకొనేం దుకు ప్రభుత్వం అనుమతినివ్వటంతో ఆర్టీసీ బస్సులు మంగళవారం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. మరోవైపు బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికుల కోసం పూర్తి స్థాయిలో శానిటైజింగ్ చేస్తున్నారు.

ప్రయాణికులు మాస్కులు ధరించటం, బస్లాండ్లు, బస్సుల్లో కచ్చితంగా భౌతికదూరం పాటించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బస్సులో నిలబడి చేసే ప్రయాణాలకు అనుమతి లేదు. ప్రతి ట్రిప్‌ తర్వాత బస్సును శానిటైజ్‌ చేయనున్నారు. ఆర్టీసీ సిబ్బందికి డిపోల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించాకే అధికారులు అనుమతించే అవకాశం ఉంది. 

వరంగల్‌ వైపునుంచి వచ్చే బస్సులు ఉప్పల్‌ వరకు, నల్లగొండ వైపు నుంచి వచ్చే బస్సులు హయత్‌నగర్‌ వరకు, మహబూబ్‌నగర్‌వైపు నుంచి వచ్చేవి ఆరాంఘర్‌ వరకు, తాండూర్‌, వికారాబాద్‌ నుంచి వచ్చేవి అప్పా జంక్షన్‌ వరకు, కరీంనగర్‌వైపు వచ్చేవి జేబీఎస్‌వరకు వచ్చేందుకు అనుమతి ఉంటుంది. సిటీబస్సులు లేకపోవటంతో ప్రయాణికులు ఆటోలు, క్యాబ్‌ల్ల్లో ఇళ్లు చేరుకోవచ్చు. నగరంలోని ఎంజీబీఎస్‌, దిల్‌సుఖ్‌నగర్‌ బస్టాండ్లలో ఎలాంటి బస్సు సౌకర్యాలు అందుబాటులో ఉండవు. కరోనా వైరస్ ప్రభావం సిటీలోనే అధికంగా ఉండటంతో సిటీ బస్సులకు అనుమతి లేదు. 

Read :

రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు నడుస్తాయా? 

తెలంగాణలో రోడ్డెక్కనున్న బస్సులు, నగర శివార్ల నుంచే జిల్లాలకు, MGBSకు వచ్చే బస్సులకు నో ఎంట్రీ