RRR: సజ్జనార్ వాడకం మామూలుగా లేదుగా!

ప్రస్తుతం టాలీవుడ్‌లో అందరి చూపులు ఆర్ఆర్ఆర్ సినిమాపైనే ఉన్నాయి. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ కావడంతో....

RRR: సజ్జనార్ వాడకం మామూలుగా లేదుగా!

Tsrtc Md Sajjanar Uses Rrr For Rtc Promotions

RRR: ప్రస్తుతం టాలీవుడ్‌లో అందరి చూపులు ఆర్ఆర్ఆర్ సినిమాపైనే ఉన్నాయి. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ కావడంతో ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆతృతగా చూస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ఇప్పటికే ఓ రేంజ్‌లో నిర్వహిస్తున్నారు చిత్ర యూనిట్.

RRR: జక్కన్న భారీ ప్రమోషన్స్ స్కెచ్.. ఫ్యాన్స్‌కు పండగే!

పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా వస్తుండటంతో ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని అందరూ చూస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో కూడా ఆర్ఆర్ఆర్ ప్రభావం ఏ రేంజ్‌లో ఉందో మనకు తెలిసిందే. కాగా ఈ సినిమాకున్న క్రేజ్‌ను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ కూడా వాడుకుంటోంది. TSRTC MD వి.సి.సజ్జనార్ క్రియేటివిటీ చూసి నెటిజన్లు వావ్ అంటూ ఆయన్న పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. RRR చిత్రం నుండి తాజాగా రిలీజ్ అయిన ‘ఎత్తర జెండా’ పాటలోని ఓ సీన్‌ను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వదిలారు సజ్జనార్.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు కలిసి జెండాను పైకెత్తే సీన్‌లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రతిబింబేచాలో ఎడిట్ చేసిన వీడియోను తన సోషల్ ఖాతాలో పోస్ట్ చేశారు సజ్జనార్. రాజమౌళి RRRను సజ్జనార్ తెలంగాణ RRR(రాష్ట్ర రోడ్డు రవాణా)గా మార్చి చేసిన వీడియోను నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

RRR: ‘ఆర్ఆర్ఆర్’కు ఏపీ ప్రభుత్వం రిలీఫ్..?

ఏదేమైనా RRR క్రేజ్‌ను వాడటంలో సజ్జనార్ అందరికంటే కాస్త ముందుగానే ఉన్నాడని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇక తారక్, చరణ్‌లు కలిసి నటిస్తున్న ఈ మూవీని మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు జక్కన్న అండ్ టీమ్ రెడీ అయ్యింది. ఈ సినిమాలో అజయ్ దేవ్గన్, ఆలియా భట్, ఒలివియా మారిస్ తదితరులు నటిస్తుండగా కీరవాణి సంగీతం ఈ సినిమాకు అదనపు ఆకర్షణ కానుంది.