RRR: ‘ఆర్ఆర్ఆర్’కు ఏపీ ప్రభుత్వం రిలీఫ్..?

ఏపీలో నెలకొన్న సినిమా టికెట్ రేట్ల వివాదంపై గతకొద్ది రోజులుగా ఇండస్ట్రీ జనాల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. అయితే ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్ల విషయంపై...

RRR: ‘ఆర్ఆర్ఆర్’కు ఏపీ ప్రభుత్వం రిలీఫ్..?

Ap Govt Allows Rrr Tickets For Rs 100 Hike

RRR: ఏపీలో నెలకొన్న సినిమా టికెట్ రేట్ల వివాదంపై గతకొద్ది రోజులుగా ఇండస్ట్రీ జనాల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. అయితే ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్ల విషయంలో పునరాలోచించాలని సినిమా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు పలు దఫాలుగా సీఎం జగన్‌ను కలిసి తమ మొర వినిపించారు. అయితే సినిమా టికెట్ల రేట్లపై ఏపీ ప్రభుత్వం కొత్త జీవోను విడుదల చేయడంతో సినిమా రంగానికి చెందిన వారు సంతోషం వ్యక్తం చేశారు. కానీ ఈ జీవో ప్రకారం ఏపీలో 20 శాతం షూటింగ్ జరుపుకున్న సినిమాలకు మాత్రేమే టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కలిగిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

RRR : ‘ఆర్ఆర్ఆర్’ సినిమా డిస్ట్రిబ్యూషన్‌ ‘భీమ్లానాయక్’ నిర్మాతల చేతుల్లో..

టాలీవుడ్‌లో భారీ బడ్జెట్ చిత్రాలు వరుసగా రిలీజ్‌కు రెడీ కావడంతో, ఈ అవకాశాన్ని రాధేశ్యామ్ సినిమాకు ఉపయోగపడుతుందని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. అయితే రీసెంట్‌గా ఏపీ సీఎం జగన్‌ను స్టార్ డైరెక్టర్ రాజమౌళి మరియు నిర్మాత డివివి.దానయ్యలు కలిసి సినిమా టికెట్ల గురించి చర్చించారు. ఈ క్రమంలో త్వరలో రిలీజ్ కాబోతున్న తమ భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ కోసం సినిమా టికెట్ల రేటు పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతిని ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు.

ఈ సమావేశంలో సీఎం జగన్ తమకు సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. అయితే ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఆర్ఆర్ఆర్ చిత్ర టికెట్ల రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. ఏపీలో ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ రేట్లను అదనంగా రూ.100 పెంచుకోవచ్చని ప్రభుత్వం అనుమతినిచ్చిందట. అయితే బెనిఫిట్ షోల విషయంలో ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.

RRR: రిలీజ్‌కు ముందే ఓవర్సీస్‌లో RRR జాతర!

ఏదేమైనా ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల రేటును అదనంగా రూ.100 పెంచుకునే వెసులుబాటు కల్పించడంతో ఇది ఖచ్చితంగా RRRకు ఉపయోగపడుతుందనే చెప్పాలి. అసలే భారీ బడ్జెత్‌తో తెరకెక్కిన సినిమా కావడం, డిస్ట్రిబ్యూటర్లకు కూడా భారీ రేటుకు ఈ సినిమా హక్కులను అమ్మడంతో అందరూ నష్టపోకుండా ఉండేందుకు జక్కన్న చేసిన ప్రయత్నం ఫలించిందని చెప్పాలి. ఇక బెనిఫిట్ షోలకు కూడా పర్మిషన్ దొరికితే RRR భారీ కలెక్షన్లు రాబట్టడం ఖాయమని అంటున్నారు సినీ విశ్లేషకులు. అయితే ఈ టికెట్ల రేటు పెంపు విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.