RRR: రిలీజ్‌కు ముందే ఓవర్సీస్‌లో RRR జాతర!

టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ మూవీగా ఆర్ఆర్ఆర్ ఇప్పటికే ఎలాంటి క్రేజ్‌ను క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే.

RRR: రిలీజ్‌కు ముందే ఓవర్సీస్‌లో RRR జాతర!

Rrr Pre Sales In Overseas Creates Milestone

RRR: టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ మూవీగా ఆర్ఆర్ఆర్ ఇప్పటికే ఎలాంటి క్రేజ్‌ను క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం కేవలం ఇండియన్ ఆడియెన్స్ మాత్రమే కాకుండా యావత్ ప్రపంచంలోని సినిమా లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఓవర్సీస్ ప్రేక్షకులు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

RRR: ‘ఎత్తర జెండా’ పాటలో అదరగొట్టిన తారక్, చరణ్!

కాగా ఈ చిత్రం రిలీజ్‌కు ముందే పలు కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మూవీని గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో ఓవర్సీస్‌లో ఇప్పటికే టికెట్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద ఓ అరుదైన మైల్‌స్టోన్‌ను అందుకుంది. సినిమా రిలీజ్‌కు ముందే టికెట్ ప్రీబుకింగ్ సేల్స్‌లో దుమ్ములేపుతూ, RRR ఇటీవల 1 మిలియన్ డాలర్ మార్క్‌ను క్రాస్ చేసింది.

RRRలో పాట పాడడం.. నా అదృష్టం..!

ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రీబుకింగ్ సేల్స్ ఏకంగా 1.5 మిలియన్ డాలర్ మార్క్‌ను టచ్ చేసి తన సత్తా ఏమిటో చూపించింది. ఈ సినిమా రిలీజ్‌కు ఇంకా 10 రోజుల సమయం ఉండటంతో ఇది ఖచ్చితంగా రిలీజ్‌కు ముందే ప్రీబుకింగ్స్ రూపంలో 2 మిలియన్ డాలర్ల మార్క్‌ను ఈజీగా టచ్ చేస్తుందని మూవీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. దర్శకధీరుడు రాజమౌళి స్టామినా, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ల క్రేజ్ కలగలసి ఈ సినిమాకు ఇంత భారీ హైప్‌ను తీసుకొచ్చాయి.

RRR: ఆకాశమే హద్దుగా తారక్ మాసివ్ క్రేజ్..!

ఈ సినిమాను పీరియాడికల్ ఫిక్షన్ డ్రామాగా జక్కన్న తీర్చిదిద్దడంతో ఈ మూవీని ఎలాగైనా చూడాలని అభిమానులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్, ఆలియా భట్, ఒలివియా మారిస్ లాంటి నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తుండగా, ఎంఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. డివివి.దానయ్య ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించడంతో ఈ సినిమా వసూళ్ల పరంగా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని సినీ ఎక్స్‌పర్ట్స్ లెక్కలు వేస్తున్నారు.