RRR: జక్కన్న భారీ ప్రమోషన్స్ స్కెచ్.. ఫ్యాన్స్‌కు పండగే!

నాలుగు సంవత్సరాల సినిమా, మూడు సంవత్సరాల మేకింగ్ ప్రాజెక్ట్. వరల్డ్ వైడ్ ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ఆర్ఆర్ఆర్ రిలీజ్ కి ఇంకా కొన్ని రోజులే టైమ్ ఉంది. మార్చ్ 25న..

RRR: జక్కన్న భారీ ప్రమోషన్స్ స్కెచ్.. ఫ్యాన్స్‌కు పండగే!

Rrr

RRR: నాలుగు సంవత్సరాల సినిమా, మూడు సంవత్సరాల మేకింగ్ ప్రాజెక్ట్. వరల్డ్ వైడ్ ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ఆర్ఆర్ఆర్ రిలీజ్ కి ఇంకా కొన్ని రోజులే టైమ్ ఉంది. మార్చ్ 25న ఆడియెన్స్ ముందుకొస్తున్న ట్రిపుల్ ఆర్ గ్రాండియర్ ప్రమోషన్స్ తో, ఫాన్స్ పండగ చేసుకోవాలి. జాతరకు వచ్చినట్టు ప్రేక్షకులను థియేటర్లకి రప్పించాలన్నది జక్కన్న మాస్టర్ ప్లాన్. అందుకోసం ట్రిపుల్ టీమ్ ఏమేం చేస్తుందో చూద్దాం.

RRR: అప్పుడు ఆ రాముడు.. ఇప్పుడు రాముడు.. ఫ్యాన్స్ పండగ!

తారక్, చరణ్, రాజమౌళి, అజయ్ దేవగన్, ఆలియాభట్ అభిమానులకు కౌంట్ డౌన్ నడుస్తోంది. మార్చి 25న ట్రిపుల్ ఆర్ థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా ఎగబడి చూస్తున్నారు ఫాన్స్. రాజమౌళి సినిమాను ఎంత గ్రాండ్ గా తెరకెక్కిస్తారో ప్రమోషనూ అంతే తెలివిగా ఎగ్జిక్యూట్ చేస్తారు. లేటెస్ట్ గా నెత్తురు మరిగితే ఎత్తర జెండా సాంగ్ రిలీజ్ అయ్యి, ఫాన్స్ ను ఒక ఊపు ఊపేస్తోంది. చరణ్, తారక్, ఆలియా భట్ సై అంటే సై అన్నట్టు పెర్ఫామెన్స్ తో అదరగొట్టారు. ఫాన్స్ లో పండగ వాతావరణం తీసుకొచ్చారు.

RRR: ‘ఎత్తర జెండా’ పాటలో అదరగొట్టిన తారక్, చరణ్!

సోమవారం ట్రిపుల్ ఆర్ ప్రొడ్యూసర్ డివివి దానయ్యతో కలసి గౌ.ఏపి ముఖ్యమంత్రిని కలసిన జక్కన్న బెనిఫిట్ షో, పెయిడ్ ప్రీమియర్ షో లతో పాటు టికెట్ రేట్స్ పైన చర్చించారు. ఏపిలో నిర్వహించాలనుకుంటున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి కూడా మాట్లాడినట్టు సమాచారం. సో ఈ రకంగా భారీ వసూళ్లను రాబట్టుకునేందుకు ట్రిపుల్ ఆర్ విషయంలో రాజమౌళి ఎంత సీరియస్ గా వర్క్ చేస్తున్నాడో అర్థమవుతుంది.

RRR: నెత్తురు మరిగితే ఎత్తర జెండా.. ఆర్ఆర్ఆర్ నుండి మరో పాట

ఆల్రెడీ ట్రిపుల్ ఆర్ కోసం పీక్స్ లో ప్రమోషన్స్ చేశారు. ఊహించని పరిణామాలతో వాయిదా పడిన ట్రిపుల్ ఆర్ రీ ప్రమోషన్స్ కూడా చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసింది జక్కన్న టీమ్. మార్చి 18న దుబాయ్ లో బిగ్గెస్ట్ ఈవెంట్, మార్చి 19న కర్ణాటక, చిక్ బళ్లాపూర్ లో లార్జ్ స్కేల్ ఈవెంట్, 20న హైదరాబాద్ లో గ్రాండ్ ఈవెంట్ కు ప్లాన్ చేస్తోంది. వీటితో తో పాటు ఏపిలో కూడా బిగ్ ఈవెంట్, ఇంటర్వ్యూస్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

RRR: క్రేజీ మల్టీస్టారర్‌కు రెండే వారాలు.. జక్కన్నా ఇక నీదే లేట్!

ఆర్ఆర్ఆర్ పై గ్లోబల్ ఆడియన్స్ భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అందరి ఎక్స్ పెక్టేషన్స్ కు రీచ్ అయ్యేలా ప్రమోషన్స్ తో పాటు ఈ సినిమాను సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ తో పాటు, హిందీ అండ్ ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ ఇయర్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సినిమాగా ట్రిపుల్ ఆర్ ఐమాక్స్ వెర్షన్ లో రిలీజ్ కానుంది. ఈ రకమైన రిలీజ్ సౌత్ ఇండియాలోనే సెకెండ్ టైమ్ బాహుబలి 2 తర్వాత ట్రిపుల్ ఆరే అయితే, డాల్బీ విజన్ లో రిలీజ్ చేయడం ఇండియాలోనే ఫస్ట్ టైమ్. సో ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయిన తర్వాత ఇంకెన్ని రికార్డ్ లు క్రియేట్ చేస్తుందో చూడాలని ఫాన్స్ క్యూరియస్ గా చూస్తున్నారు ఫాన్స్.