Twin Towers: 40 అంతస్తుల బిల్డింగ్స్ కూల్చివేయనున్న అధికారులు.. ఎక్కడంటే

నోయిడా పట్టణంలో సూపర్ టెక్ ట్విన్ టవర్స్ పేరుతో 40 అంతస్తులున్న రెండు బిల్డింగ్స్ నిర్మించారు. అయితే, ఇవి అక్రమ నిర్మాణాలని తేలింది. దీనిపై భారత సుప్రీంకోర్టు కూడా విచారణ జరిపి, ఈ అక్రమ నిర్మాణాల్ని కూల్చివేయాలని ఆదేశించింది.

Twin Towers: 40 అంతస్తుల బిల్డింగ్స్ కూల్చివేయనున్న అధికారులు.. ఎక్కడంటే

Twin Towers

Twin Towers: అక్రమంగా కట్టిన 40 అంతస్తుల బిల్డింగ్స్ కూల్చివేసేందుకు సిద్ధమవుతోంది అధికార యంత్రాంగం. నోయిడా పట్టణంలో సూపర్ టెక్ ట్విన్ టవర్స్ పేరుతో 40 అంతస్తులున్న రెండు బిల్డింగ్స్ నిర్మించారు. అయితే, ఇవి అక్రమ నిర్మాణాలని తేలింది. దీనిపై భారత సుప్రీంకోర్టు కూడా విచారణ జరిపి, ఈ అక్రమ నిర్మాణాల్ని కూల్చివేయాలని ఆదేశించింది. ఆగష్టు 21న వీటిని కూల్చివేయాలని ఆదేశించింది.

Vivo Fraud: 62 వేల కోట్లు అక్రమంగా చైనాకు తరలించిన ‘వివో’

దీంతో నోయిడా అధికారులు ఈ భారీ బిల్డింగులను కూల్చబోతున్నారు. అయితే, ఈ బిల్డింగ్స్ చుట్టుపక్కల మరి కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. దీంతో ఈ కూల్చివేత వల్ల వాటికి కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్తగా అన్ని రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న అపార్టుమెంట్లలో దాదాపు 1,500 వరకు కుటుంబాలు నివసిస్తున్నాయి. కూల్చివేతల సందర్భంగా అధికారులు వీళ్లందరినీ సురక్షిత ప్రదేశాలకు తరలించనున్నారు. ఈ కూల్చివేతల ప్రక్రియను ఒక ప్రముఖ కంపెనీకి అప్పగించారు. పేలుడు పదార్థాలు వాడి, అధునాతన పద్ధతిలో ఈ బిల్డింగ్స్ కూల్చివేయనున్నారు. ప్రస్తుతం ఈ కూల్చివేతల తీవ్రతను అధికారులు అంచనా వేస్తున్నారు.

Dalai Lama: దలైలామా మా అతిథి.. చైనాకు భారత్ జవాబు

దీనికి సంబంధించిన ఆడిట్ నిర్వహించబోతున్నారు. గతంలోనే దీనిపై తనిఖీలు నిర్వహించారు. ఇతర బిల్డింగులకు ప్రమాదం లేదని నిపుణులు చెప్పారు. మరోవైపు కూల్చివేత బాధ్యతలు తీసుకున్న కంపెనీ స్థానికులతో మాట్లాడుతోంది. వీరు తీసుకుంటున్న చర్యలపై స్థానికులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. దేశంలో ఇలా పేలుడు పదార్థాలతో కూల్చివేయనున్న అతి ఎత్తైన నిర్మాణాలు ఇవే.