Twitter: కేంద్రంపై కర్ణాటక హై కోర్టుకు ట్విట్టర్.. కేంద్రంతో ముదిరిన వార్

గత సంవత్సరం మే 26 నుంచి కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. దీని ప్రకారం తన ప్లాట్‌ఫామ్‌పై ఉన్న అభ్యంతరకర కంటెంట్ తొలగించాలని కేంద్రం ట్విట్టర్‌ను ఆదేశించింది. రైతుల ఉద్యమానికి మద్దతుగా ఉన్న కొంతమంది జర్నలిస్టులు, రాజకీయ నేతలు, అంతర్జాతీయ సంస్థలు, మద్దతుదారుల ట్వీట్లు తొలగించాలని సూచించింది.

Twitter: కేంద్రంపై కర్ణాటక హై కోర్టుకు ట్విట్టర్.. కేంద్రంతో ముదిరిన వార్

Twitter

Twitter: అనుచిత కంటెంట్ తొలగించాలంటూ కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలను సవాలు చేస్తూ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. దీంతో కేంద్రం, ట్విట్టర్ మధ్య కొంతకాలంగా సాగుతున్న కోల్డ్‌వార్ ముదిరినట్లైంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ నూతన ఐటీ రూల్స్ రూపొందించింది.

Nupur Sharma Row: నుపుర్ శర్మకు మద్దతు.. నాగ్‌పూర్ కుటుంబానికి బెదిరింపులు

గత సంవత్సరం మే 26 నుంచి కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. దీని ప్రకారం తన ప్లాట్‌ఫామ్‌పై ఉన్న అభ్యంతరకర కంటెంట్ తొలగించాలని కేంద్రం ట్విట్టర్‌ను ఆదేశించింది. రైతుల ఉద్యమానికి మద్దతుగా ఉన్న కొంతమంది జర్నలిస్టులు, రాజకీయ నేతలు, అంతర్జాతీయ సంస్థలు, మద్దతుదారుల ట్వీట్లు తొలగించాలని సూచించింది. అయితే, ట్విట్టర్ వీటిలో చాలావరకు కంటెంట్ తొలగించలేదు. దీనిపై ఐటీ యాక్ట్ సెక్షన్ 69ఏ ప్రకారం ట్విట్టర్‌కు కేంద్రం నోటీసులు జారీ చేసింది. కంటెంట్ తొలగించేందుకు చివరి అవకాశం ఇస్తున్నట్లు నోటీసుల్లో పేర్కొంది. గత నెల 6, 9న రెండుసార్లు నోటీసులు ఇచ్చింది.

Cab Driver: ప్యాసింజర్‌ను కొట్టి చంపిన క్యాబ్ డ్రైవర్

జూన్ 27న మరోసారి నోటీసులు ఇచ్చింది. జూలై 4లోపు ఈ కంటెంట్ తొలగించేందుకు చివరి గడువుగా నిర్ణయించింది. ఈ ఆదేశాల్ని ట్విట్టర్ పాటిస్తూ, ఆ కంటెంట్ తొలగించింది. గత సంవత్సరం కూడా కేంద్రం అనుచిత కంటెంట్ ఉన్న 80 ఖాతాల వివరాల్ని ట్విట్టర్‌కు సమర్పించింది. వాటిని కూడా ట్విట్టర్ తొలగించింది. అయితే, కేంద్రం ఆదేశాలపై ట్విట్టర్ న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఒక అంతర్జాతీయ మీడియా సంస్థ తెలిపింది. ఈ అంశంపై కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి స్పందనా రాలేదు.