Nupur Sharma Row: నుపుర్ శర్మకు మద్దతు.. నాగ్‌పూర్ కుటుంబానికి బెదిరింపులు

నాగ్‌పూర్‌ సిటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన 22 ఏళ్ల యువకుడు నుపుర్ శర్మ వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. దీంతో అతడికి బెదిరింపులు వచ్చాయి. కన్హయ్య లాల్ హత్యకంటే ముందే యువకుడి కుటుంబానికి బెదిరింపులు రావడం విశేషం.

Nupur Sharma Row: నుపుర్ శర్మకు మద్దతు.. నాగ్‌పూర్ కుటుంబానికి బెదిరింపులు

Nupur Sharma Row

Nupur Sharma Row: నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ఉదయ్‌పూర్‌లో కన్హయ్య లాల్‌తోపాటు, అమరావతిలో ఉమేష్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలు ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు అలా నుపుర్ శర్మకు మద్దతుగా నిలిచిన వాళ్లపై ఇంకా బెదిరింపులు ఆగడం లేదు. నుపుర్ శర్మ వ్యాఖ్యలకు మద్దతుగా పోస్టు పెట్టినందుకు నాగ్‌పూర్‌కు చెందిన ఒక యువకుడికి, అతడి కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయి.

Cab Driver: ప్యాసింజర్‌ను కొట్టి చంపిన క్యాబ్ డ్రైవర్

దీంతో ఆ కుటుంబం తీవ్రంగా ఆందోళన చెందుతోంది. నాగ్‌పూర్‌ సిటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన 22 ఏళ్ల యువకుడు నుపుర్ శర్మ వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. దీంతో అతడికి బెదిరింపులు వచ్చాయి. కన్హయ్య లాల్ హత్యకంటే ముందే యువకుడి కుటుంబానికి బెదిరింపులు రావడం విశేషం. యువకుడితోపాటు, అతడి కుటుంబాన్ని చంపుతామని బెదిరింపులు రావడంతో ఆ కుటుంబం తమ ఇంటిని వదిలేసి వెళ్లిపోయింది. దాదాపు రెండు వారాలపాటు బయటే గడిపారు. ఇటీవలే ఆ కుటుంబం తిరిగొచ్చింది. అయినప్పటికీ ఇంకా భయంభయంగానే బతుకుతున్నారు. ఈ విషయంలో పోలీసులు స్పందించారు. గత నెలలోనే యువకుడిపై ఒక దాడిని పోలీసులు ఆపగలిగారు. ఆ కుటుంబానికి భద్రత కల్పించారు.

SpiceJet Flight: కరాచీలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయిన స్పైస్ జెట్ విమానం

దాడి హెచ్చరికల నేపథ్యంలో ఆ యువకుడు తన పోస్టును డిలీట్ చేయడమే కాకుండా, క్షమాపణలు కూడా కోరాడు. పోలీసులు కూడా ఆ యువకుడిని, మరో వర్గానికి చెందిన పెద్దలను కలిపి సమస్య పరిష్కరించి, సానుకూల వాతావరణం ఏర్పడేలా చేశారు. అయినప్పటికీ, గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగానే ఉంటున్నట్లు పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ తెలిపారు. ఈ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకుని, నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.