Ugadi 2023 : రుతువుల రాణీ ‘వసంత’కాలం..కోకిలమ్మ కమ్మని పాటల మేళవింపు..పరిమళాల గుభాళింపు ‘ఉగాది’ విశిష్టిత ..

రుతువుల రాణీ ‘వసంత’కాలం ఉగాది పండుగతో ప్రారంభమవుతుంది. ఉగాది పండుగ వచ్చిందంటే కోకిలమ్మ కమ్మని పాటలు, చిగుర్లతో పచ్చగా కళకళలాడే చెట్లు, రంగు రంగుల పూలతో పరిమళాల గుభాళింపు ఇలా ‘ఉగాది’ విశిష్టితలు ఎన్నో ఎన్నెన్నో..

Ugadi 2023 : రుతువుల రాణీ ‘వసంత’కాలం..కోకిలమ్మ కమ్మని పాటల మేళవింపు..పరిమళాల గుభాళింపు ‘ఉగాది’ విశిష్టిత ..

Ugadi 2023

Ugadi 2023 : వసంతాలు తెచ్చే కాలం వసంతకాలం. ఉగాది పండుగ రోజునే వసంత కాలం ప్రారంభమవుతుంది. మామిడి చిగుర్లు తిని కోకిలమ్మ గొంతు సవరించుకుని తన కమ్మని గానంతో అలరిస్తుంది. కుహూ కుహూ అంటూ మామిడి చిగుర్లు తింటూ కమ్మగా పాడుతుంది కోకిలమ్మ. అలా వసంతకాలం, కోకిలమ్మ,ఉగాది పండుగకు ప్రకృతి కల్పించిన అవినావభావ సంబంధం. ఉగాది పండగతో ఈ ఋతువు ఆరంభం అవుతుంది. తెలుగు సంవత్సరం ఆరంభం చైత్రం మాసంతో ప్రారంభమవుతుంది. అలా చైత్రం, వైశాఖ మాసాలు వసంతకాలం పచ్చని చీర కట్టుకుని కనువిందుచేస్తుంది ప్రకృతి మాత. చెట్లు చిగురించి పూవులు విరబూసే కాలం. ఋతువుల రాణీ వసంతకాలం..ఇలా వసంతకాలం గురించి ఎంత చెప్పినా తక్కువే. వసంత అంటే రంగులకాలం. అన్ని రంగుల పువ్వులు విరబూసి కనువిందు చేస్తాయి. పువ్వులు విరబూసి పరిమళాలు విరజిల్లే కాలం..

Ugadi 2023 : షడ్రుచుల సమ్మేళనం .. ఉగాది పచ్చడితో ఆరోగ్యం

వసంతకాలంలో ఎడారుల్లో కూడా పచ్చతనం కనిపిస్తుంది అక్కడక్కడా..ఉత్తరాన హిమాలయాల నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు ఎడారులు, పర్వతాలు,లోయలు,అడవులు ఆకుపచ్చ దుప్పటి కప్పుకుని..రంగు రంగుల పూలతో పరవశించిపోతాయి. వసంతకాలం పర్యాటనలకు చక్కటి అనువైన కాలం.

అటువంటి అందాల వసంతకాలం ఉగాది పండుగతో ఆరంభమవుతుంది. ఉగాది పండుగతో తెలుగువారి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పండగ జరుపుకోని తెలుగు వారు ఉండరు. ఈ ఉగాది ఒక్క తెలుగువారే కాకుండా దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, ఆంద్ర ప్రదేశ్, తెలంగాణా, మహారాష్ట్ర ప్రజలు జరుపుకుంటారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉపయోగించే చంద్రమాన పంచాంగం ప్రకారం మొదటి నెల చైత్రమాసం. చైత్రమాసం మొదటి రోజైన చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాదిని జరుపుకుంటారు.

Ugadi 2023 : ఉగాది పండుగ విశిష్టత .. ఉగాది పచ్చడి ప్రాముఖ్యత

ఉగస్య ఆది అనేదే ఉగాది. సంవత్సరానికి తొలి మాసం చైత్రమాసం… చైత్రమాసం అనగానే మనకి ఈనెలలో ఉగాది, శ్రీరామనవమి గుర్తుకొస్తాయి. చైత్ర శుధ్ద పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజులపాటు వసంత నవరాత్రులు జరుపుతారు. పౌర్ణమి రోజున చంద్రుడు చిత్తా నక్షత్రంలో ఉన్న రోజు కాబట్టి దీనికి చైత్రము అనే పేరు వచ్చిందని కూడా చెపుతారు.

సూర్యుడు కూడా మొదటి రాశియైన మేష రాశిలో సంచరిస్తున్నాడు. చైత్ర మాసంలో జరుపుకునే వసంత నవరాత్రులకు రామాయణానికి ఏదో అవినాభావ సంబంధం ఉందనిపిస్తుంది. రామాయణంలోని ఎన్నో ముఖ్య ఘట్టాలు ఈ తొమ్మిది రోజులలో జరిగాయి. రాముడు జన్మించింది మొదలు, వనవాసానికి వెళ్ళటం, దశరథుని మరణం, సీతాపహరణం, రావణుని సంహారానంతరం సీతారాములు అయోధ్యానగరానికి చేరటం, శ్రీరామపట్టాభిషేకము వంటివి ఎన్నో ముఖ్యమైన సంఘటనలు ఈ చైత్రమాసంలో జరిగాయని పురాణాలు చెబుతున్నాయి.

Ugadi 2023 : ‘ఉగాది’ ఏ రాష్ట్రంలో ఏ పేరుతో జరుపుకుంటారో తెలుసా?

ఉగాది నాడు దేవాలయాల్లో పంచాంగ శ్రవణాలు జరుగుతాయి. ఆసంవత్సరంలో జరగబోయే అనేక ముఖ్యమైన విషయాలను పండితులు ప్రజలకు వివరిస్తారు. జనవరి నెలతో ప్రారంభమయ్యే ఇంగ్లీషు వారి క్యాలెండర్ మాదిరిగానే తెలుగువారి పంచాంగం చైత్ర శుద్ద పాడ్యమితో మొదలవుతుంది.