Ugadi 2023 : ‘ఉగాది’ ఏ రాష్ట్రంలో ఏ పేరుతో జరుపుకుంటారో తెలుసా?

 ‘ఉగాది’ని యుగాది అని కూడా అంటారు. యుగాది అంటూ సంవత్సర (తెలుగు సంవత్సరం) ప్రారంభం అని అర్థం. వసంతమాసంలో వస్తుందీ పండుగ. వసంత మాసంలో వచ్చే ఈ పండుగకు ప్రకృతికి ఎంతో అవినాభావ సంబంధం ఉంటుంది.‘ఉగాది’ ఏ రాష్ట్రంలో ఏ పేరుతో జరుపుకుంటారో తెలుసా?

Ugadi 2023 : ‘ఉగాది’ ఏ రాష్ట్రంలో ఏ పేరుతో జరుపుకుంటారో తెలుసా?

Ugadi 2023

Ugadi 2023 : ‘ఉగాది’ని యుగాది అని కూడా అంటారు. యుగాది అంటూ సంవత్సర (తెలుగు సంవత్సరం) ప్రారంభం అని అర్థం. వసంతమాసంలో వస్తుందీ పండుగ. వసంత మాసంలో వచ్చే ఈ పండుగకు ప్రకృతికి ఎంతో అవినాభావ సంబంధం ఉంటుంది. భారతీయ సాంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమినాడే అంటే ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. ప్రతీ తెలుగు సంవత్సరాదికి ఓ పేరు ఉంటుంది. అలా ఈ 2023వ సంవత్సరం ఉగాది పేరు ‘శోభకృత్ నామసంవత్సరం’..

ఉగాది రోజునే సృష్టికర్త బ్రహ్మదేవుడు ఈ సృష్టిని సృష్టించాడం ప్రారంభించారని చెబుతారు. ప్రభవ నామ ఉగాదితో బ్రహ్మకల్పం మొదలై నేటికీ కొనసాగుతూనే ఉంది. శ్రీమహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి సోమకుడుని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు కూడా ఇదే అని చెబుతారు.

Ugadi 2023 : ఉగాది పండుగ విశిష్టత .. ఉగాది పచ్చడి ప్రాముఖ్యత

ఈ పండుగను తెలుగు రాష్ట్రాల్లో ‘ఉగాది’పేరుతో జరుపుకుంటారు. మరి భారతదేశంలో ఏ ఏ రాష్ట్రాల్లో ఏఏ పేర్లతో ఈ పండుగను జరుపుకుంటారో తెలుసా?.. ఎందుకంటే భారతదేశం విభిన్నజాతులు,మతాలు,కులాలు,సంస్కృతి,సంప్రదాయాల మేలు కలయిక.అలాగే ఎన్నో భాషలు భారతదేశంలో వాడుకలో ఉన్నాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ,గుజరాతీ,బెంగాలీ ఇలా ఎన్నో భాషల కలయిగా విరాజిల్లుతోంది భారతదేశం. అందుకే భారతదేశ వ్యాప్తంగా జరుపుకునే పండుగలు కూడా ఆయా ప్రాంతాలు, రాష్ట్రాలను బట్టి పేర్లు మార్పుతో జరుపుకుంటుంటారు భారతీయులు.

తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రంలో ఉగాది పండుగను ఉగాది పేరుతోనే జరుపుకుంటారు. అదే మహారాష్ట్రలో గుడి పడ్వా గా, కేరళలో విషు,తమిళనాడులో పుత్తాండు, సిక్కులు వైశాఖి, బెంగాలీలు పోయ్ లా బైశాఖ్ పేరుతో ఉగాది పండుగను జరుపుకుంటారు. ఇక ఉగాది అంటే అర్థం ‘ఉగ’ అంటే నక్షత్ర గమనం ‘ఆది’ అంటే మొదలు అని అర్థం. అంటే ఈ సృష్టి, ప్రపంచ నక్షత్ర గమనం మొదలైనటువంటి మొదటి రోజు ఉగాది. జనవరి ఒకటవ తేదీన పాశ్చాత్తులు కొత్త సంవత్సరంగా భావిస్తే, తెలుగువారు మాత్రం ఉగాది రోజునే కొత్త సంవత్సరం ఆరంభంగా పరిగణిస్తారు. తెలుగు వారికీ కొత్త సంవత్సరం..వసంత ఋతువు, చైత్ర మాసంలోని పాడ్యమి రోజునుంచి ప్రారంభమవుతుంది.