Digital India Bill: ఇంటర్నెట్‭పై కేంద్రం కఠిన ఆంక్షలు.. 11 అంశాలతో కొత్తగా డిజిటల్ ఇండియా బిల్లు

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021 చివరిలోనే జాబితాలోనే ఈ విషయాల్ని చేర్చారు. అయితే అలాంటి కంటెంట్‌ను హోస్ట్ చేయడానికి ప్లాట్‌ఫారమ్‌లను జవాబుదారీగా ఉంచడానికి డిజిటల్ ఇండియా బిల్లు ప్రభుత్వానికి చట్టపరమైన బాలన్ని ఇస్తుందని ఆయన అన్నారు

Digital India Bill: ఇంటర్నెట్‭పై కేంద్రం కఠిన ఆంక్షలు.. 11 అంశాలతో కొత్తగా డిజిటల్ ఇండియా బిల్లు

Updated On : June 9, 2023 / 8:09 PM IST

Union Govt: దేశంలో ఇంటర్నెట్‭ దుర్వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించేందుకు సిద్ధమైంది. మరింత తీవ్ర సవాలుగా మారుతున్న సైబర్ నేరాలను అడ్డుకోవడంతో పాటు, తప్పుదారి పట్టించే కంటెంట్‭ను అడ్డుకోవడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నూతన డిజిటల్ ఇండియా బిల్లును తీసుకువస్తున్నట్లు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. డిజిటల్ ఇండియా బిల్లుపై ఈ నెలలో సంప్రదింపులు ప్రారంభమవుతాయని, కొత్త డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు త్వరలో పార్లమెంటులో ప్రవేశ పెడతామని ఆయన తెలిపారు.

Punjab Politics: సిద్ధూ వల్లే భగవంత్ మాన్ సీఎం అయ్యారా.. ఇంతకీ సిద్ధూ భార్య బయటపెట్టిన విషయం ఏంటి?

డిజిటల్ ఇండియా బిల్లు పిల్లలపై లైంగిక వేధింపులు, మతపరమైన రెచ్చగొట్టే అంశాలు, పేటెంట్ ఉల్లంఘన, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తప్పుడు సమాచారంతో సహా పలు రకాల ఆన్‌లైన్ భద్రతా సమస్యలను పరిష్కరిస్తుందని కేంద్ర మంత్రి రాజీవ్ అన్నారు. 11 విషయాల జాబితాలో ‘పోర్న్, పిల్లలకు హానికరమైన కంటెంట్, కాపీరైట్ ఉల్లంఘన, తప్పుదారి పట్టించే కంటెంట్, వంచన, దేశ ఐక్యత- సమగ్రతకు విరుధ్దమైన కంటెంట్, కంప్యూటర్ మాల్వేర్, నిషేధించబడిన ఆన్‌లైన్ గేమ్‌లు, చట్టవిరుద్ధమైనవి’ ఉన్నాయి.

Manipur Violence: మణిపూర్ అల్లర్లపై ఆరు కేసులు నమోదు.. విచారణ వేగవంతం చేసిన సీబీఐ

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021 చివరిలోనే జాబితాలోనే ఈ విషయాల్ని చేర్చారు. అయితే అలాంటి కంటెంట్‌ను హోస్ట్ చేయడానికి ప్లాట్‌ఫారమ్‌లను జవాబుదారీగా ఉంచడానికి డిజిటల్ ఇండియా బిల్లు ప్రభుత్వానికి చట్టపరమైన బాలన్ని ఇస్తుందని ఆయన అన్నారు. డిజిటల్ ప్రపంచంలో భారతదేశం వేగవంతమైన పరివర్తన చెందిందని ఆయన అన్నారు. నేడు దేశంలో 85 కోట్ల మంది ప్రజలు ఇంటర్నెట్‌ ఉపయోగిస్తున్నారని, దీంతో మనం ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్నెట్ యూజర్ల దేశంగా మారామని తెలిపారు. ఇక 2025 నాటికి ఈ సంఖ్య 120 కోట్లకు చేరుకుంటుందని పేర్కొన్నారు.

Opposition Parties Meet: ఆరంభానికి ముందే అవరోధాల్ని ఎదుర్కొంటున్న విపక్ష పార్టీల సమావేశం? నితీశ్ నెట్టుకొస్తారా?

ఇక ఇంటర్నెట్‭లో జరిగిన తప్పిదాలకు కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆయన విమర్శలు గుప్పించారు. 2008లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఐటీ చట్టానికి చేసిన సవరణల కారణంగా టెక్, సోషల్ మీడియా కంపెనీలకు ఇష్టానుసారంగా మారిందని, దాని వల్లే నేటి అనర్థాలని అన్నారు. 2014లో తాము అధికారంలోకి వచ్చినప్పుడు విషపూరిత ఇంటర్నెట్ వ్యవస్థను వారసత్వంగా పొందామని చంద్రశేఖర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.