Ujjaini bonalu 2022: అమ్మ‌వారికి బోనం స‌మ‌ర్పించిన కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి.. ఏర్పాట్ల‌పై ఏమ‌న్నారంటే..

తెలంగాణ సంస్కృతి సంప్ర‌దాయాలు ఉట్టిప‌డేలా నిర్వ‌హించే సికింద్రాబాద్ ఉజ్జ‌యిని మ‌హంకాళి అమ్మ‌వారి బోనాల సంబురాలు అంగ‌రంగ వైభ‌వంగా ప్రారంభ‌మ‌య్యాయి. కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి అమ్మ‌వారికి ద‌ర్శించుకొని బోనం స‌మ‌ర్పించారు

Ujjaini bonalu 2022: అమ్మ‌వారికి బోనం స‌మ‌ర్పించిన కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి.. ఏర్పాట్ల‌పై ఏమ‌న్నారంటే..

New Project(39)

Ujjaini bonalu 2022: తెలంగాణ సంస్కృతి సంప్ర‌దాయాలు ఉట్టిప‌డేలా నిర్వ‌హించే సికింద్రాబాద్ ఉజ్జ‌యిని మ‌హంకాళి అమ్మ‌వారి బోనాల సంబురాలు అంగ‌రంగ వైభ‌వంగా ప్రారంభ‌మ‌య్యాయి. తల్లి బయిలెల్లినాదో.. నాయనో.. అమ్మా బయిలెల్లినాదో.. అంటూ భక్తుల సందడి ప్రారంభమయ్యింది. తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుటుంబ సమేతంగా తొలిపూజ నిర్వహించారు. అనంతరం భక్తుల దర్శనానికి అనుమతి ఇచ్చారు.

Lashkar Bonalu : ప్రారంభమైన లష్కర్‌ బోనాలు..ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించిన మంత్రి తలసాని

ఉజ్జ‌యినీ మ‌హంకాళి అమ్మ‌వారిని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ద‌ర్శించుకున్నారు. అమ్మ‌వారికి బోనం స‌మ‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా కిష‌న్ రెడ్డి, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ఆల‌య అర్చ‌కులు ఘ‌న స్వాగ‌తం ప‌లికి ఆశీర్వ‌చ‌నం చేశారు. అనంత‌రం కిష‌న్ రెడ్డి మాట్లాడుతూ.. అనేక సంవ‌త్స‌రాలుగా బోనాలు నిర్వ‌హ‌ణ సంప్ర‌దాయంగా వ‌స్తోంద‌ని, అమ్మ‌వారిని ద‌ర్శించుకోవ‌టం ఆనందంగా ఉంద‌ని అన్నారు.

Henna : ఆషాఢంలో ఆరోగ్యానికి మేలు చేసే గోరింటాకు!

దేశంలో ఈ ర‌క‌మైన పండుగ ఎక్క‌డా క‌నిపించ‌ద‌ని, ధ‌నిక, పేద అనే తేడాలేకుండా ఈ బోనాలు నిర్వ‌హిస్తున్నార‌ని కిష‌న్ రెడ్డి అన్నారు. బోనాల సంద‌ర్భంగా భ‌క్తులు భారీ సంఖ్య‌లో వ‌స్తున్నార‌ని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆల‌య నిర్వాహ‌కులు కృషి చేస్తున్నార‌ని తెలిపారు. అంటు వ్యాధులు రాకుండా, ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డ‌కుండా, క‌రోనా పూర్తిగా న‌యం కావాల‌ని అమ్మ‌వారిని ప్రార్థించిన‌ట్లు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి అన్నారు.

India vs England 3rd ODI: నేడు భార‌త్ – ఇంగ్లండ్ మ‌ధ్య చివ‌రి స‌మ‌రం.. కోహ్లీవైపు అంద‌రిచూపు

భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భారీగా త‌ర‌లివ‌స్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆరు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. పాత రాంగోపాల్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ వైపు నుంచి సాదారణ భక్తులు, వీఐపీ పాస్‌లతో వచ్చే వారిని, బోనాలతో వచ్చే వారిని కూడా ఇక్కడి నుంచి అనుమతి ఇస్తున్నారు. బోనాలతో వచ్చే మహిళల కోసం బాటా నుంచి ఒక క్యూలైన్‌. టొబాకో బజార్‌ నుంచి దాతల కోసం, అంజలీ థియేటర్‌ నుంచి వీఐపీ, సాధారణ భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు.