CM Yogi Adityanath: భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న సీఎం యోగి ఆదిత్యనాథ్.. సంజయ్ వ్యాఖ్యలతో ఆశ్చర్యపోయిన యోగి

చార్మినార్ ప్రాంతంలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తో కలిసి భాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయానికి చేరుకున్న యోగి.. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

CM Yogi Adityanath: భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న సీఎం యోగి ఆదిత్యనాథ్.. సంజయ్ వ్యాఖ్యలతో ఆశ్చర్యపోయిన యోగి

Cm Yogi

CM Yogi Adityanath: చార్మినార్ ప్రాంతంలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తో కలిసి భాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయానికి చేరుకున్న యోగి.. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యూపీ సీఎంకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. యోగి రాక సందర్భంగా ఆలయాన్ని బీజేపీ నేతలు సర్వాంగ సుందరంగా అలంకరించారు.

Yogi

భాగ్యలక్ష్మి అమ్మవారి విశిష్టతను సీఎం యోగి ఆదిత్యనాథ్ అడిగి తెలుసుకున్నారు. అమ్మవారి ఆలయ విశిష్టతను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ లు వివరించారు. ప్రజా సంగ్రామ యాత్రను ఇక్కడి నుండే ప్రారంభించానని సంజయ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి ప్రదేశంలో అంతపెద్ద సభ ఎలా నిర్వహించారంటూ యోగి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఓల్డ్ సిటీ పరిసర ప్రాంతాలను చూసి ఎందుకు అభివృద్ధి జరగడం లేదంటూ ఆరా తీశారు. ఎంఐఎం, టీఆర్ఎస్ పొత్తులోనే ఉన్నాయికదా ఎందుకు అభివృద్ధి జరగడం లేదంటూ నేతలను ప్రశ్నించారు. ఎంఐఎం ముస్లింలను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకోవడం తప్ప అభివృద్ధిపై దృష్టి పెట్టరని లక్ష్మణ్ యూపీ సీఎంకు వివరించారు.

Yogi (1)

సీఎం యోగి ఆధిత్యనాథ్ భాగ్యలక్ష్మీ ఆలయానికి వచ్చిన నేపథ్యంలో పోలీసులు చార్మినార్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలను మోహరించారు. ప్రతీఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీలు చేసి పంపించారు. ఆలయం చుట్టూ 500 మీటర్ల దూరంలో మూడు వలయాల భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం350మంది పోలీసులతో చార్మినార్, భాగ్యలక్ష్మి ఆలయం, లాడ్ బజార్, సర్దార్ మహల్ చూట్టూ భద్రత కొనసాగించారు. షెడ్యూల్ ప్రకారం శనివారమే అమ్మవారి దర్శనానికి యోగి ఆదిత్యనాథ్ రావాల్సి ఉంది. కానీ సమయం సర్దుబాటు కాకపోవటంతో వాయిదాపడింది.