UP Elections 2022: ఉద్యోగం, అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్‌కు ఓటేయండి – ప్రియాంక గాంధీ

కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ యూపీలోని అలీఘర్ లో శనివారం జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. ఉద్యోగాలు, అభివృద్ధి కావాలంటే రాబోయే ఎన్నికల్లో తమ పార్టీకే ఓటేయాలని అన్నారు.

UP Elections 2022: ఉద్యోగం, అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్‌కు ఓటేయండి – ప్రియాంక గాంధీ

Priyanka Gandhi

Updated On : February 6, 2022 / 7:38 AM IST

UP Elections 2022: కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ యూపీలోని అలీఘర్ లో శనివారం జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. ఉద్యోగాలు, అభివృద్ధి కావాలంటే రాబోయే ఎన్నికల్లో తమ పార్టీకే ఓటేయాలని అన్నారు. కాంగ్రెస్ మినహాయించి అన్ని పార్టీలు సంప్రదాయాలపైనే రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు.

‘నేను ప్రజలను ఒక్కటే అడుగుతున్నా. మీకు మార్పు కావాలని అంటే, ఉద్యోగాలు, అభివృద్ధి కావాలంటే మాకు ఓటేయండి. మిగిలిన రాజకీయ పార్టీలన్నీ ఒకేరకమైన రాజకీయం చేస్తున్నాయి’ అని ఆమె వివరించారు. ప్రతి ఇంటికీ తిరిగి ప్రచారం కూడా పాల్గొన్నారు ప్రియాంక. మరికొద్ది రోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జోరుగా పాల్గొంటున్నారు.

కాంగ్రెస్ మాజీ లీడర్ అయిన రాజీవ్ త్యాగి భార్య సంగీత త్యాగికి సాహిబాబాద్ లో సీట్ ఇచ్చి పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు. యూపీలోని అసెంబ్లీ ఎన్నికలు ఏడు దశలుగా జరగనున్నాయి. ఫిబ్రవరి 10న తొలి దశ పోలింగ్ కాగా మార్చి7తో ఇవి ముగియనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెల్లడిస్తుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా.

Read Also : కర్ణాటకలో హిజాబ్ వివాదం..యూనిఫాం ధరించాలి

యూపీలోని 403సీట్లలో తొలిసారి పోటీ చేసేందుకు సిద్ధమైంది కాంగ్రెస్. ‘మేం అన్ని సీట్ల నుంచి పోటీ చేయాలనుకుంటున్నాం. 30ఏళ్లలో 403సీట్లలో పోటీ చేయడం తొలిసారి. ప్రజా సమస్యలను ఎత్తి చూపాలనుకుంటున్నాం. ప్రజలకు ఇబ్బందిపెడుతున్న అంశాలను తెలుసుకోవాలనుకుంటున్నాం’ అని చెబుతున్నారు ప్రియాంక గాంధీ వాద్రా.