Ayodhya: అయోధ్య రామ్ మందిర్ పరిసరాల్లో మద్యం నిషేధం

రామ మందిరం పరిసరాల్లోని మద్యం షాపుల లైసెన్సులు క్యాన్సిల్ చేస్తున్నట్లు ఉత్తర ప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి నితిన్ అగర్వాల్ బుధవారం వెల్లడించారు. పలువురు సాధువులు, సన్యాసులు ఎప్పట్నుంచో దీనిపై డిమాండ్ చేస్తున్నారు.

Ayodhya: అయోధ్య రామ్ మందిర్ పరిసరాల్లో మద్యం నిషేధం

Ram Temple Construction

Ayodhya: అయోధ్యలోని రామజన్మభూమి దేవాలయం పరిసరాల్లో మద్యం విక్రయాలపై నిషేధం విధిస్తూ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రామ మందిరం పరిసరాల్లోని మద్యం షాపుల లైసెన్సులు క్యాన్సిల్ చేస్తున్నట్లు ఉత్తర ప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి నితిన్ అగర్వాల్ బుధవారం వెల్లడించారు. పలువురు సాధువులు, సన్యాసులు ఎప్పట్నుంచో దీనిపై డిమాండ్ చేస్తున్నారు. రామజన్మభూమి గుడి పరిసరాలతోపాటు, ఇతర ఆధ్యాత్మిక కేంద్రాల్లో మద్యం, మాంసం విక్రయాలు నిలిపివేయాలని చాలా కాలం నుంచి కోరుతున్నారు.

New District Courts: రేపటి నుంచి కొత్త జిల్లాల కోర్టుల్లో సేవలు ప్రారంభం

దీంతో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది మధురలో కూడా మద్యం, మాంసం విక్రయాలు నిలిపివేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, ఈ వ్యాపారంపై ఆధారపడ్డ వాళ్లకు ప్రత్యామ్నాయం చూపాల్సిందిగా కూడా యోగి, అధికారులకు సూచించారు. దీనికి సంబంధించిన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.