Upasana : ఈ ఏడాది మా ఆయనదే.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా చరణ్‌కి సపోర్ట్‌గా ఉంటాను.. ఉపాసన వ్యాఖ్యలు..

తాజాగా ఉపాసన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చరణ్ గురించి తెగ పొగిడేసింది. ఉపాసన మాట్లాడుతూ.. నేను ఎలాంటి పరిస్థితుల్లోనైనా చరణ్ కి మద్దతుగా ఉంటాను. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా చరణ్ కి సపోర్ట్ గా నిలుచుంటాను. షూటింగ్ లో బిజీ ఉన్నా................

Upasana : ఈ ఏడాది మా ఆయనదే.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా చరణ్‌కి సపోర్ట్‌గా ఉంటాను.. ఉపాసన వ్యాఖ్యలు..

Upasana intresting comments on Ram Charan goes viral

Updated On : March 8, 2023 / 9:37 AM IST

Upasana :  RRR సినిమాతో రామ్ చరణ్, ఎన్టీఆర్ దేశ వ్యాప్తంగానే కాక విదేశాల్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. జపాన్, అమెరికా దేశాల్లో అయితే ఎన్టీఆర్, చరణ్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. త్వరలో ఆస్కార్ వేడుకలు ఉండటంతో ప్రస్తుతం చిత్రయూనిట్ అంతా అమెరికాలో బిజీగా ఉన్నారు. ఇక చరణ్ తో పాటు ఉపాసన కూడా RRR యూనిట్ తో వెళ్తూ సందడి చేస్తుంది. చరణ్, ఉపాసన కలిసి ప్రస్తుతం అమెరికాలో ఓ పక్క RRR ప్రమోషన్స్ చేస్తూనే మరోపక్క ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఉపాసన ప్రెగ్నెంట్ కూడా.

తాజాగా ఉపాసన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చరణ్ గురించి తెగ పొగిడేసింది. ఉపాసన మాట్లాడుతూ.. నేను ఎలాంటి పరిస్థితుల్లోనైనా చరణ్ కి మద్దతుగా ఉంటాను. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా చరణ్ కి సపోర్ట్ గా నిలుచుంటాను. షూటింగ్ లో బిజీ ఉన్నా, ఎప్పుడైనా తనకి కావాల్సిన సాయం చేస్తాను. ఈ సంవత్సరం చరణ్ కి బాగా కలిసొస్తుంది. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా 2023 చరణ్ కి చాలా ఆనందాన్ని ఇస్తుంది. అవార్డులు, ప్రశంసలు అందుకుంటున్నాడు. తన వర్క్ పట్ల సంతృప్తిగా ఉన్నాడు. అంతర్జాతీయంగా గుర్తింపు వస్తుంది. ఈ ఏడాది మా ఆయనదే అంటూ మురిసిపోయింది ఉపాసన.

Ram Charan – Upasana : ఉపాసనతో రామ్‌చరణ్ అమెరికాలో స్పెషల్ షాపింగ్.. వైరల్ అవుతున్న ఉపాసన పోస్ట్!

దీంతో ఉపాసన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఉపాసన లాంటి వైఫ్ ఉంటే చాలా లక్కీ అని కామెంట్స్ చేస్తున్నారు. రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా చరణ్ కి ఫుల్ సపోర్ట్ ఇస్తున్న ఉపాసనని అభినందిస్తున్నారు.