Ram Charan – Upasana : ఉపాసనతో రామ్‌చరణ్ అమెరికాలో స్పెషల్ షాపింగ్.. వైరల్ అవుతున్న ఉపాసన పోస్ట్!

రామ్ చరణ్ ఇటీవల ఆస్కార్ అవార్డుల వేడుకల్లో పాల్గొనేందుకు ఒక్కడే అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా తన భార్య ఉపాసన కూడా అమెరికా వెళ్ళింది. ఇక రామ్ చరణ్ ఆస్కార్ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంటున్నాడు. ఇంత బిజీ టైములో కూడా తన భార్య ఉపాసన కోసం రామ్ చరణ్ టైం కేటాయించాడట. ఆ విషయాన్ని తెలియజేస్తూ..

Ram Charan – Upasana : ఉపాసనతో రామ్‌చరణ్ అమెరికాలో స్పెషల్ షాపింగ్.. వైరల్ అవుతున్న ఉపాసన పోస్ట్!

Ram Charan and Upasana are enjoying in america

Ram Charan – Upasana : రామ్ చరణ్ ఇటీవల ఆస్కార్ అవార్డుల వేడుకల్లో పాల్గొనేందుకు ఒక్కడే అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా తన భార్య ఉపాసన కూడా అమెరికా వెళ్ళింది. ఇక రామ్ చరణ్ ఆస్కార్ ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలకు, స్పెషల్ స్క్రీనింగ్స్ కి హాజరవుతూ.. అక్కడ ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అవుతూ బిజీ బిజీగా ఉంటున్నాడు. ఇంత బిజీ టైములో కూడా తన భార్య ఉపాసన కోసం రామ్ చరణ్ టైం కేటాయించాడట. ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక వీడియో పోస్ట్ చేసింది.

Ram Charan : సల్మాన్ సినిమాలో చరణ్ స్టెప్పులు.. పూర్తిగా సౌత్ సినిమాగా మారిపోతున్న కిసీకా భాయ్ కిసీకా జాన్..

ఈ వీడియోలో రామ్ చరణ్, ఉపాసన కలిసి అమెరికాలో జాలిగా ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నారు. సముద్రంలో డాల్ఫిన్స్ మధ్య బోట్ లో వెళుతూ, కారులో షికారులు కొడుతూ, అలాగే ఉపాసనకి కావాల్సిన షాపింగ్ కొనిపిస్తూ, ఆ కొన్న బ్యాగ్స్ అన్ని చరణ్ మోస్తూ వస్తుంటే, ఉపాసన మాత్రం జాలిగా ముందు చేతులు ఊపుకుంటూ వెళుతుంది. ఇక ఈ వీడియో కింద ఉపాసన ఇలా రాసుకొచ్చింది.. ఇంత బిజీ టైములో కూడా మా కోసం (కడుపులో ఉన్న బిడ్డని కలుపుకొని) టైం స్పెండ్ చేసినందుకు థాంక్యూ Mr C. కాగా ఈ వీడియో అభిమానులకు కన్నుల విందుల ఉంది.

ఇది ఇలా ఉంటే, RRR ప్రస్తుతం ఆస్కార్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. మార్చి 12 రాత్రి ఈ అవార్డుల పురస్కారం జరగనుంది. ఇండియన్ టైం ప్రకారం మార్చి 13 ఉదయం గం.5:30 నిముషాలు నుంచి ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ మొదలు కానుంది. ఈ వేడుకను ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. ఇక ఈ వేడుక పై నాటు నాటు సాంగ్ ని సింగర్స్ కార్తికేయ, రాహుల్ సిప్లిగుంజ్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)