Objectionable Remark Case: జయప్రదపై అండర్‌వేర్ కామెంట్స్.. కోర్టులో కేసు విచారణ నేడే!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్‌లో ప్రత్యేక కోర్టులో ఈరోజు(09 నవంబర్ 2021) మాజీ ఎంపీ జయప్రదపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసు విచారణ జరగనుంది.

Objectionable Remark Case: జయప్రదపై అండర్‌వేర్ కామెంట్స్.. కోర్టులో కేసు విచారణ నేడే!

Jayapradha

Objectionable Remark case: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్‌లో ప్రత్యేక కోర్టులో ఈరోజు(09 నవంబర్ 2021) మాజీ ఎంపీ జయప్రదపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసు విచారణ జరగనుంది. ఈ కేసులో అజాంఖాన్‌, అతని కొడుకు అబ్దుల్లా అజంఖాన్ సహా చాలామంది నిందితులపై అభియోగాలు నమోదు చేయనున్నారు. అజం ఖాన్‌తో పాటు పలువురు ఎస్పీ నేతలు ఇందులో నిందితులుగా ఉన్నారు.

ఈ కేసులో కోర్టుకు హాజరుకాకపోవడంతో రాంపూర్ మున్సిపల్ మాజీ అధ్యక్షుడు అజరుఖాన్‌ను కోర్టు పరారీలో ఉన్న నిందితునిగా ప్రకటించగా, మిగిలిన నిందితులు బెయిల్‌పై ఉన్నారు. నిందితుల ఛార్జ్‌షీట్‌ను ప్రశ్నిస్తూ, కోర్టులో ఇచ్చిన డిశ్చార్జ్ దరఖాస్తును కూడా కోర్టు తిరస్కరించింది. ఇప్పుడు ఈ కేసులో అభియోగాలను రూపొందించనున్నారు.

ఈ కేసులో నిందితుడు మొరాదాబాద్‌ ఎస్పీ ఎంపీ డాక్టర్‌ ఎస్‌టీ హసన్‌ వాయిస్‌ నమూనా మ్యాచ్‌ జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్పీ ఎంపీ డాక్టర్ ఎస్.టి.హసన్ కష్టాలు కూడా ఇప్పుడు పెరగవచ్చు. అదే సమయంలో, ఈ కేసులో ఇద్దరు నిందితులు అజం ఖాన్.. అతని కుమారుడు అబ్దుల్లా అజంఖాన్ సీతాపూర్ జైలులో ఉన్నారు

రాంపూర్ నుంచి బీజేపీ తరపున జయప్రద, సమాజ్‌వాదీ పార్టీ నుంచి అజంఖాన్ పోటీ చేయగా.. ఈ సమయంలోనే విమర్శలు హీట్ పుట్టించాయి. జయప్రదను రాంపూర్ తీసుకొచ్చింది నేనే. అయితే ఆమె ఖాకీ అండర్ వేర్ ధరించిందని మాత్రం గుర్తించలేకపోయా..’ అంటూ అజాంఖాన్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో కాంట్రవర్శీ అయ్యాయి. 2019లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇది జరిగింది.

అజంఖాన్ కొడుకు అబ్దుల్లా ఖాన్ కూడా ఆలీ కావాలి, భజరంగ్‌ బలీ కావాలి కానీ, అనార్కలీ మాత్రం వద్దంటూ జయప్రదను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఇలా జయప్రదపై ఆ సమయంలో చాలామంది సమాజ్‌వాదీ పార్టీ నేతలు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.