1,999 pages Love Letter Viral : 23 ఏళ్ల క్రితం భార్యకు 1,999 పేజీల ప్రేమలేఖ రాసిన భర్త .. ఇప్పుడు వైరల్
జీవన్ సింగ్ అనే వ్యక్తి 23 ఏళ్ల క్రితం తన భార్యకు రాసిన లేఖ ఇప్పుడు వైరల్ గా మారింది. 1,999 పేజీల ‘ప్రేమలేఖ’ రాశారు జీవన్ సింగ్ తన భార్యకు. ఈ భారీ ‘ప్రేమలేఖ’ రాయటానికి జీవన్ సింగ్ కు మూడు నెలల సమయం పట్టిందట. ఈ ప్రేమికుడి ప్రేమను వ్యక్తంచేసే ఈ అపురూపమైన లేఖ బరువు 8 కిలోలు..10 లక్షలకు పైగా పదాలతో తన ప్రేమను ఇంకుగా మార్చి మరీ రాసారు జీవన్ సింగ్ తన భార్య కమలకు.

Uttarakhand man 1,999 pages Love Letter Viral :
Uttarakhand man 1,999 pages Love Letter Viral : ఇప్పుడంటే టెక్నాలజీ వచ్చి వాట్సాప్ లు వంటి సోషల్ మీడియాల్లో ప్రేమను వ్యక్తం చేసుకుంటున్నారు గానీ ఒకప్పుడు ‘ప్రేమలేఖ’..ప్రేమను వ్యక్తం చేసే సాధనంగా ఉండేది. వాట్సాప్ మెసెజ్ డిలీట్ చేస్తే పోతుంది. కానీ ‘ప్రేమలేఖ’ ఎప్పటికి గుర్తుండిపోతుంది. తమ ప్రేమను అక్షరాలుగా మలచి రాసే లేఖ ఓ తీపి గుర్తు. ఓ అపురూర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అటువంటి ఓ భారీ ‘ప్రేమలేఖ’ అదీకూడా 23 ఏళ్ల క్రితం భర్త భార్యకు రాసిన ‘ప్రేమలేఖ’ ఇప్పుడు వైరల్ గా మారింది. ఎందుకంటే ఆ ‘ప్రేమలేఖ’ చాలా భారీగా ఉంది అతని ‘ప్రేమ’ అంత ‘గాఢం’గా..!!
ఉత్తరాఖండ్ అల్మోఢా జిల్లాలోని చాపఢ్ గ్రామానికి చెందిన జీవన్ సింగ్ 23 ఏళ్ల క్రితం తన భార్యకు రాసిన లేఖ ఇప్పుడు వైరల్ గా మారింది. ఒకటి రెండూ కాదు 10 కాదు 20 కూడా కాదు ఏకంగా 1,999 పేజీల ‘ప్రేమలేఖ’ రాశారు జీవన్ సింగ్ తన భార్యకు. ఈ భారీ ‘ప్రేమలేఖ’ రాయటానికి జీవన్ సింగ్ కు మూడు నెలల సమయం పట్టిందట. మరి ఇన్ని పేజీలు రాయాలంటే ఎన్ని పెన్నులు ఉపయోగించాడో ఈ ప్రేమికుడు అనే అనుమానం కూడా వస్తుంది కదూ..నిజమే జీవన్ సింగ్ వందల పేజీల ప్రేమలేఖ రాయటానికి ఏకంగా 111 పెన్నులు ఇంకు పట్టిందట..అంతేనా ఈ ప్రేమికుడి ప్రేమను వ్యక్తంచేసే ఈ అపురూపమైన లేఖ బరువు 8 కిలోలు..10 లక్షలకు పైగా పదాలతో తన ప్రేమను ఇంకుగా మార్చి మరీ రాసారు జీవన్ సింగ్ తన భార్య కమలకు.
అల్మోఢా జిల్లాలోని చాపఢ్ గ్రామానికి చెందిన జీవన్ సింగ్.. అదే గ్రామానికి చెందిన కమలను చూసిన తొలిచూపులోనే మనసు పారేసుకున్నారట.. అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లుగా..అదీకూడా చిన్నతనంలోనే కమలను చూసి మనసు పారేసుకున్నారు. కమల కూడా జీవన్ సింగ్ అంటే ఇష్టపడ్డారట. దీంతో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కానీ పెళ్లి అయ్యాక జీవన్ సింగ్ ఉద్యోగం రీత్యా భార్యా భర్తలు వేరుగా ఉండాల్సి వచ్చింది. దీంతో ముద్దుల భార్య కమలను వదిలి..ఉండలేని జీవన్ తన ప్రేమను వ్యక్తంచేయటానికి ఈ ‘ప్రేమలేఖ’ను రాశారట…అదే ఈ భారీ ప్రేమలేఖ..1,999పేజీల ప్రేమలేఖ. ఈ ప్రేమలేఖ రాయటానికి జీవన్ సింగ్ కు అప్పట్లో రూ.700లు ఖర్చు అయ్యిందట..పేపర్లు,పెన్నులు కొనటానికి ఇంక్ వంటి ఖర్చులన్నమాట..
పెళ్లి తర్వాత జీవన్‌కు ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్ జిల్లాలో ఉద్యోగం వచ్చింది. దీంతో భార్యతో కలిసి అక్కడికి వెళ్లారు. కొంతకాలం తర్వాత కమల పుట్టింటికి వచ్చింది. దీంతో జీవన్ సింగ్ విరహవేదనతో ప్రేమను రంగను ఇంకులో రంగరించి ప్రత్యేకమైన ప్రేమలేఖ రాయాలనుకున్నారట. అలా తన భార్య మీద ఉన్న ప్రేమను జీవన్ ఓ వైపు డ్యూటీ చేసుకుంటూ మరోవైపు ‘ప్రేమలేఖ’ రాస్తుండేవారు. అలా మూడు నెలలపాటు ఆ లేఖ రాశారు. ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్లి రావడం.. సాయంత్రం ఇంటికి వచ్చాక పనులు ముగించుకుని ప్రశాంతంగా కూర్చుని భార్య కమలను తలచుకుంటూ లేఖ రాయటం చేస్తుండేవారు. అదో అలవాటుగా మారిపోయింది. అలా దూరంగా ఉన్న భార్య కమల జ్ఞాపకాలను తలచుకుంటూ లేఖ రాయటం అలవాటుగా మారిపోయిందాయనకు.
అప్పట్లో పెద్దగా ఫోన్ సౌకర్యాలు లేకపోవటంతో అలా తాను చెప్పాలనుకున్న మాటలు, వ్యక్తపరచాలనుకున్న భావాలకు అక్షర రూపం ఇస్తూ ఏకంగా ఒకటి తక్కువ 2000ల పేజీల ప్రేమలేఖ రాశారు జీవన్ సింగ్. ఆ లేఖను పోస్ట్ చేయటానికి జీవన్ సింగ్ కు అప్పట్లో రూ.700లు ఖర్చు అయ్యిందట..పేపర్లు,పెన్నులు కొనటానికి ఇంక్ వంటి ఖర్చులన్నమాట.. ఈ ప్రేమలేఖతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తన పేరును నమోదు చేసుకునేందుకు జీవన్ సింగ్ ప్రయత్నిస్తున్నారు.
కాగా ఆ ప్రేమలేఖను అందుకున్న కమల సంతోషం అంతా ఇంతాకాదటజ తన భర్తకు తనపై ఎంత ప్రేమ ఉందో పుస్తకంలాంటి ఆ ప్రేమలేఖను ఆమె ఎన్నో సార్లు చదువుకునేవారట. దాన్ని అపురూపంగా దాచుకున్నారు. ఆ లేఖ చదువుకున్న కమల భర్తకు తిరిగి ఉత్తరం రాశారట. అలా ఆ భారీ ప్రేమలేఖ రెండు దశాబ్దాలు దాటినా తరువాత కూడా వారి ఇంటిలో ఓ మధుర జ్ఞాపకంగా ఉండిపోయింది. అదే మా విలువైన ఆస్తి అంటున్నారీ భార్యా భర్తలు. ప్రస్తుతం 63 ఏళ్ల వయస్సులో ఉన్న జీవన్ సింగ్ అపురూపంగా ఆ భారీ ప్రేమలేఖను చదువుకుంటుంటారట. అటువంటి ప్రేమలేఖను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తన పేరును నమోదు చేసుకునేందుకు జీవన్ సింగ్ ప్రయత్నిస్తున్నారు.