V Hanumantha rao: భాగ్యలక్ష్మి ఆల‌యం గురించి బండి సంజ‌య్ రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేస్తున్నారు: వీహెచ్‌

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజ‌య్‌పై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వి.హ‌నుమంత రావు మండిప‌డ్డారు. బండి సంజయ్ మళ్లీ ప్ర‌జ‌ల భావోద్వేగాల‌ను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్య‌లు చేస్తున్నారని వీహెచ్ ఆరోపించారు. హైద‌రాబాద్‌ చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి అమ్మ వారి గుడిపై ఎవరూ చెయ్యి వేయ‌ర‌ని ఆయ‌న అన్నారు.

V Hanumantha rao: భాగ్యలక్ష్మి ఆల‌యం గురించి బండి సంజ‌య్ రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేస్తున్నారు: వీహెచ్‌

Vh

V Hanumantha rao: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజ‌య్‌పై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వి.హ‌నుమంత రావు మండిప‌డ్డారు. బండి సంజయ్ మళ్లీ ప్ర‌జ‌ల భావోద్వేగాల‌ను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్య‌లు చేస్తున్నారని వీహెచ్ ఆరోపించారు. హైద‌రాబాద్‌ చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి అమ్మ వారి గుడిపై ఎవరూ చెయ్యి వేయ‌ర‌ని ఆయ‌న అన్నారు. అమ్మవారిని తాము కూడా కొలుస్తామ‌ని చెప్పారు.

Arvind Kejriwal: మా అంద‌రినీ అరెస్టు చేసేయండి: కేజ్రీవాల్

అలాగే, చార్మినార్ వద్ద ముస్లింలు నమాజ్ చేస్తార‌ని, అదే ప్రాంతంలో హిందువులు భాగ్యలక్ష్మి అమ్మవారికి మొక్కుతారని వీహెచ్ అన్నారు. చార్మినార్ వద్ద ముస్లింల ప్రార్థనలకు అనుమతించాలని కోరుతూ కాంగ్రెస్ స్థానిక నేత రషీద్ ఖాన్ సంతకాల ఉద్య‌మాన్ని ప్రారంభించారంటూ వార్త‌లు వ‌చ్చాయ‌ని, అయితే, ఆయన ఎవరో త‌మ‌కు తెలియ‌ద‌ని, పార్టీలో దీనిపై చ‌ర్చించి తెలుసుకుంటామని వీహెచ్ వ్యాఖ్యానించారు.

Telangana formation day: తెలుగులో ట్వీట్లు చేసి తెలంగాణ ప్ర‌జ‌ల‌కు మోదీ, షా శుభాకాంక్ష‌లు

త‌మ‌ పార్టీ వాళ్లు రెచ్చగొట్టే చర్యలకు పాల్ప‌డితే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వీహెచ్ అన్నారు. ఇలాంటి సాధార‌ణంగా ఎంఐఎం చేస్తుందని, ఈ కుట్ర వెనక వారి హస్తం ఉందేమోనని అనుమానంగా ఉందని వీహెచ్ చెప్పారు. బీజేపీ, ఎంఐఎం మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని ఆరోపించారు. అలాగే, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న బండి సంజయ్‌పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణకు లేఖ రాస్తాన‌ని ఆయ‌న చెప్పారు.