Varudu Kaavalenu: దిగుదిగు నాగ ఫోక్ సాంగ్.. యూట్యూబ్‌లో ఓ సెన్సేషన్!

ఎప్పుడు ఏ పాట ఎంత వైరల్ అవుతుందో.. ఏ పోస్ట్ ఎప్పుడు సెన్సేషన్ అవుతుందో చెప్పలేకపోవడమే ఇప్పుడు సోషల్ మీడియాలో మనకి కనిపిస్తుంది. ఇది సినిమా పాటల నుండి షార్ట్ వీడియోల వరకు ఏదైనా..

Varudu Kaavalenu: దిగుదిగు నాగ ఫోక్ సాంగ్.. యూట్యూబ్‌లో ఓ సెన్సేషన్!

Varudu

Varudu: ఎప్పుడు ఏ పాట ఎంత వైరల్ అవుతుందో.. ఏ పోస్ట్ ఎప్పుడు సెన్సేషన్ అవుతుందో చెప్పలేకపోవడమే ఇప్పుడు సోషల్ మీడియాలో మనకి కనిపిస్తుంది. ఇది సినిమా పాటల నుండి షార్ట్ వీడియోల వరకు ఏదైనా ఒక్కటే నెటిజన్లకు నచ్చితే దాన్ని అందలం ఎక్కిస్తారు. స్టార్ హీరోల సినిమాల టీజర్లు, పాటలు, ట్రైలర్లకు మిలియన్ల కొద్దీ వ్యూస్ దక్కుతుండగా అప్పుడప్పుడు చిన్న సినిమాలకు.. మీడియా హీరోల సినిమాలకు కూడా నెట్టింట సూపర్ ఆదరణ దొరుకుంటుంది. నాగశౌర్య వరుడు సినిమా పాటకి కూడా ఇప్పుడు అలాంటి ఆదరణే దొరుకుంది.

Prabhas 25: ప్రభాస్ హీరోయిన్‌పై క్యూరియాసిటీ.. ఛాన్స్ దక్కేది ఎవరికో?

యంగ్ హీరో నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ‘వరుడు కావలెను’. సితార ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ 4వ తేదిన రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంలో మురళీ శర్మ, నదియా, వెన్నెల కిషోర్, ప్రవీణ్, హర్షవర్ధన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Big Boss 5: ఐదు వారాలకు హమీదా రెమ్యునరేషన్ ఎంతంటే?

కాగా, ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్లు విశేషం ఆకట్టుకోగా కొద్ది రోజుల క్రితం విడుదలైన ‘దిగు దిగు నాగ’ అనే ఫోక్ సాంగ్ అయితే యూట్యూబ్‌లో సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తూ వస్తుంది. ఈ పాట ఇప్పటివరకు 20 మిలియన్ ప్లస్ వ్యూస్ దక్కించుకొని యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా, శ్రేయా గోషల్ ఆలపించగా థమన్ సంగీతం అందించారు. ఓ భక్తి పాటని ఇలా ఫోక్ సాంగ్ గా మార్చారని తొలుత విమర్శలు వినిపించినా ఇప్పుడు ఆ పాటే మిలియన్ల వ్యూస్ దక్కించుకుంటుంది.