Varun Tej : ‘గని’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఏప్రిల్ వరకు వెయిట్ చేయాల్సిందే

మెగాప్రిన్స్‌ వ‌రుణ్ తేజ్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేక‌ర్ హీరోయిన్ గా కొత్త దర్శకుడు కిర‌ణ్ కొర్ర‌పాటి దర్శకత్వంలో ‘గని’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాని అల్లు అర‌వింద్.....

Varun Tej : ‘గని’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఏప్రిల్ వరకు వెయిట్ చేయాల్సిందే

Ghani

 

Ghani :  మెగాప్రిన్స్‌ వ‌రుణ్ తేజ్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేక‌ర్ హీరోయిన్ గా కొత్త దర్శకుడు కిర‌ణ్ కొర్ర‌పాటి దర్శకత్వంలో ‘గని’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాని అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ బ్యానర్ల మీద సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ నిర్మిస్తున్నారు. ‘గని’ సినిమా కిక్ బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ కి మంచి స్పందన లభించింది. ఇందులో తమన్నా ఒక స్పెషల్ సాంగ్ కూడా చేసింది.

ఇప్పటికే ఈ సినిమా మూడు నెలల నుంచి వాయిదా పడుతూ వస్తుంది. ఇటీవల ఫిబ్రవరి 25న రిలీజ్ చేద్దాం అనుకున్నారు. ప్రమోషన్స్ కూడా భారీగా నిర్వహించారు. కాని ఆ రోజు పవన్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా రిలీజ్ అవ్వటంతో ‘గని’ మరోసారి వాయిదా పడింది. మార్చ్ 4న రిలీజ్ చేద్దామనుకున్నా ఆ రోజు కూడా రెండు సినిమాలు ఉండటంతో ‘గని’ని వాయిదా వేసుకున్నారు. మార్చ్ లో ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ డేట్స్ ఫిక్స్ చేసుకొని ఉండటంతో ‘గని’ ఏకంగా ఏప్రిల్ కి వాయిదా పడింది.

Paruchuri Gopalakrishna : ‘సన్ ఆఫ్ ఇండియా’ థియేటర్స్‌లో వద్దు ఓటీటీలో రిలీజ్ చేయమన్నాను.. మోహన్‌బాబు వినలేదు  

తాజాగా వరుణ్ తేజ్ ‘గని’ సినిమాని ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో అధికారిక ప్రకటన చేసారు నిర్మాతలు. దీంతో ‘గని’ సినిమా సమ్మర్ లో సూపర్ హిట్ కొట్టడానికి రెడీ అయిపోతుంది. వరుణ్ తొలిసారిగా బాక్సర్ గా కనిపించడంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.