Varun Tej: ఆ ఇద్దరితో మల్టీస్టారర్ మూవీ చేయాలనుంది – వరుణ్!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘గని’ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే గని చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ను ఫుల్ స్వింగ్‌లో.....

Varun Tej: ఆ ఇద్దరితో మల్టీస్టారర్ మూవీ చేయాలనుంది – వరుణ్!

Varun Tej Wants To Do Multistarrer With These Heroes

Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘గని’ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే గని చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ను ఫుల్ స్వింగ్‌లో నిర్వహిస్తున్నారు చిత్ర యూనిట్. హీరో వరుణ్ తేజ్ కూడా చాలా యాక్టివ్‌గా పలు ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నాడు. కాగా తాజాగా ఆయన మీడియాతో మాట్లాడి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు.

Ghani : తెలంగాణలో పాత ధరలతోనే ‘గని’ రిలీజ్.. టికెట్ పెంపు ఉండదు..

గని చిత్రం తనకు చాలా విషయాలను నేర్పిందని వరుణ్ చెప్పుకొచ్చాడు. బాక్సింగ్ అంటే అంత సులువు కాదని.. దాని కోసం చాలా తీవ్రంగా కష్టపడాల్సి ఉందని.. ఈ సినిమాలో తనను తాను బాక్సర్‌గా చూసుకుని గర్వపడుతున్నట్లు వరుణ్ అన్నాడు. ఇక గని లాంటి పాత్రలు చాలా అరుదుగా వస్తుంటాయని, ఇలాంటి పాత్రలు అందరూ చేయాలని కోరుకుంటారని ఆయన అన్నాడు. అయితే ప్రస్తుతం మల్టీస్టారర్ చిత్రాల హవా జోరుగా సాగుతున్న నేపథ్యంలో మంచి కథ దొరికితే తాను కూడా మల్టీస్టారర్ మూవీలకు రెడీ అంటున్నాడు ఈ యంగ్ హీరో. ఇప్పటికే ఎఫ్2, ఎఫ్3 చిత్రాల్లో వెంకటేష్‌తో కలిసి నటించడం తనకు సంతోషాన్ని కలిగించిందని వరుణ్ తెలిపాడు.

Ghani: గని కోసం వరుణ్ వేరియేషన్.. ఆశలు తీరుస్తుందా?

అయతే ఇప్పుడున్న యంగ్ హీరోల్లో నితిన్, సాయి ధరమ్ తేజ్‌లతో మల్టీస్టారర్ చిత్రాలు చేయాలని తనకు ఆశగా ఉందట. అయితే ఎవరైనా డైరెక్టర్ తమ కోసం మంచి కథను పట్టుకొస్తే, వారితో మల్టీస్టారర్ మూవీకి తాను రెడీ అంటూ హింట్ ఇచ్చాడు. ఇక గని చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుందని, ఈ సినిమాను దర్శకుడు కిరణ్ కొర్రపాటి చాలా అద్భుతంగా తెరకెక్కించాడని ఆయన పేర్కొన్నాడు. గని చిత్రంలో వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ మూవీలో జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, ఏప్రిల్ 8న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి అంచనాల మధ్య రిలీజ్ కానుంది. మరి గని చిత్రంతో వరుణ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.