Viral Video: అంధులైన తల్లిదండ్రులకు తన కళ్లతో లోకాన్ని చూపిస్తున్న చిన్నారి

Viral Video: అంధులైన తల్లిదండ్రులకు తన కళ్లతో లోకాన్ని చూపిస్తున్న చిన్నారి

Viral Video

Viral Video: అంధులైన తల్లిదండ్రులను అన్నీ తానై చూసుకుంటోంది ఓ చిన్నారి. తాజాగా, రోడ్డు పక్కన ఓ దుకాణం వద్ద ఆహారం తిన్న ఆ బాలిక అదే సమయంలో తల్లిదండ్రులకూ ఆహారం అందించింది. హృదయాన్ని కదిలిస్తున్న ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ముంబైలోని ఓ దుకాణం ముందు పాఠశాల దుస్తుల్లో ఉన్న ఓ బాలిక టిఫిన్ చేసింది. ఆ బాలికతో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా అక్కడే కూర్చున్నారు. వారికి కూడా ఆ బాలిక ఆహారాన్ని పెట్టింది. టిఫిన్ చేశాక తనతో కలిసి వారినీ తీసుకెళ్లింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఇదంతా చూసి వీడియో తీశాడు. మిత్ ఇందుల్కర్ అనే వ్యక్తి ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.

మొదటిసారి వీరిని చూసినప్పుడు భావోద్వేగానికి గురయ్యానని చెప్పాడు. ప్రతిరోజు ఆ బాలిక తన తల్లిదండ్రులతో కలిసి టిఫిన్ దుకాణానికి వస్తుందని తెలిపాడు. ఆ బాలిక తల్లిదండ్రులు అంధులైనప్పటికీ, తమ కూతురి కళ్లతో లోకాన్ని చూస్తున్నారని అన్నాడు. ఆ చిన్నారి మనకు ఎన్నో నేర్పిస్తోందని చెప్పాడు. మన తల్లిదండ్రుల కన్నా మనలను బాగా చూసుకునే వారు ఎవరూ ఉండబోరని, వారు బతికి ఉండగానే మనం వారిని బాగా చూసుకోవాలని అన్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Mith Indulkar (@mith_mumbaikar)

Rs 500 Notes In Kurkure : ఇదేందయ్యా ఇది.. కుర్ కురే ప్యాకెట్లలో రూ.500 నోట్లు..! కొనేందుకు ఎగబడ్డ జనాలు