Vijay Deverakonda : రౌడీ స్టార్ క్రేజ్.. నేషనల్ వైడ్‌గా రెండో స్థానం..

బాలీవుడ్ స్టార్స్‌ను మించిన క్రేజ్, స్టార్ క్రికెటర్లను మించిన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ..

Vijay Deverakonda : రౌడీ స్టార్ క్రేజ్.. నేషనల్ వైడ్‌గా రెండో స్థానం..

Vijay Deverakonda

Vijay Deverakonda: బాలీవుడ్ స్టార్స్‌ను మించిన క్రేజ్, స్టార్ క్రికెటర్లను మించిన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. ఈ టాలీవుడ్ స్టార్ రీసెంట్‌గా ‘హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్’ గా టాప్ ప్లేస్ సంపాదించుకోగా.. ఇప్పుడు ‘టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 50’ లో నేషనల్ వైడ్‌గా రెండో స్థానం దక్కించుకున్నారు. పోయిన సంవత్సరం మూడో ప్లేస్‌లో ఉన్న విజయ్ ఇప్పుడు ఏకంగా రెండో స్థానానికి చేరుకున్నాడు. రణ్‌వీర్ సింగ్, విక్కీ కౌషల్, రణ్‌బీర్ కపూర్ లాంటి బాలీవుడ్ స్టార్స్ అంతా విజయ్ వెనకే ఉండిపోయారు.

Vijay Deverakonda : రౌడీ స్టార్ రేర్ రికార్డ్..

ఆన్ లైన్ ఓటింగ్, జ్యూరీ అభిప్రాయాల ఆధారంగా వివిధ రంగాల్లోని సెలబ్రిటీలతో టాప్ 50 మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ తయారు చేసింది టైమ్స్ గ్రూప్. నేషనల్ వైడ్‌గా జరిగిన ఆన్ లైన్ ఓటింగ్‌లో దివంగత బాలీవుడ్ స్టార్ సుశాంత్‌ సింగ్ రాజ్‌‌పుత్ తొలి స్థానం దక్కించుకోగా.. రెండో స్థానంలో విజయ్ దేవరకొండ నిలిచాడు. ఆదిత్య రాయ్ కపూర్, విక్కీ కౌషల్, దుల్కర్ సల్మాన్ తొలి ఐదు స్థానాల్లో ఉన్నారు.

‘అర్జున్ రెడ్డి’ సినిమా హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ తో బాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ బాగా పరిచయం అయ్యాడు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా ‘లైగర్’ తో హిందీ పరిశ్రమకు విజయ్ దేవరకొండ మరింత దగ్గరవుతున్నాడు. ‘టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 50’ లిస్ట్2లో విజయ్ సెకండ్ ప్లేస్ గెల్చుకోవడానికి తన పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ కూడా దోహదపడింది. దీంతో ఆయన చేస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ‘లైగర్’ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి..