Viral Video: పింఛను కోసం చెప్పులు లేకుండా ఎండలో కొన్ని కిలోమీటర్లు నడిచిన వృద్ధురాలు

Viral Video: బతకాలంటే పింఛను తీసుకోవడం తప్పనిసరి. అంతదూరం నడవడానికి చేతగాకపోయినా నడవాల్సిన పరిస్థితి.

Viral Video: పింఛను కోసం చెప్పులు లేకుండా ఎండలో కొన్ని కిలోమీటర్లు నడిచిన వృద్ధురాలు

Viral Video

Viral Video: పింఛను తీసుకోవడానికి ఓ 70 ఏళ్ల వృద్ధురాలు చెప్పులు లేకుండా ఎండలో కొన్ని కిలోమీటర్లు నడిచింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఒడిశా (Odisha) లోని నబరంగ్ పూర్ జిల్లా ఝరిగావ్ బ్లాక్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ వృద్ధురాలు చాలా బలహీనంగా ఉంది.

అయినప్పటికీ, అన్ని కిలోమీటర్లు ఎన్నో ఇబ్బందులు పడుతూ నడిచిన తీరు హృదయాన్ని ద్రవింపజేస్తోంది. సూర్యా హరిజాన్ అనే ఆ వృద్ధురాలు బతకడానికి తినాలంటే పింఛను తీసుకోవడం తప్పనిసరి. అంతదూరం నడవడానికి చేతగాకపోయినా నడవాల్సిన పరిస్థితి. విరిగిపోయిన ప్లాస్టిక్ కుర్చీని ఆసరాగా చేసుకుని, ఆ వృద్ధురాలు రోడ్డుపై నుంచి నడుచుకుంటూ వెళ్లింది.

సూర్యా హరిజాన్ పెద్ద కొడుకు ఇతర రాష్ట్రంలో కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్నాడు. దీంతో ఆమె తన చిన్న కుమారుడి వద్ద గుడిసెలో ఉంటోంది. గ్రామంలోని కొందరి పశువులను మేతకు తీసుకువెళ్లి, వారిచ్చే డబ్బుతో జీవిస్తోంది. పింఛను కోసం ఆ వృద్ధురాలు అన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లినప్పటికీ ఆమెకు ఆ డబ్బు చేతికి రాలేదు.

వేలి ముద్ర సరిపోలడం లేదని బ్యాంకు సిబ్బంది చెప్పారు. చివరకు ఆమెకు కొంత డబ్బు ఇచ్చి పంపారు. ఈ ఘటనపై స్పందించిన ఝరిగావ్ సర్పంచ్ నిస్సహాయులైన వృద్ధులు ఏ ఇబ్బందులు లేకుండా పింఛను తీసుకునేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.

Twitter: ట్విట్టర్ బ్లూ టిక్ కోల్పోయిన జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్, సమంత, కోహ్లీ.. ఇంకా ఎందరో..