Viral video: దేశం గ‌ర్విస్తోంది.. విప‌రీతంగా వైర‌ల్ అవుతున్న పాప వీడియో

ఫేస్‌బుక్‌, ట్విట‌ర్‌, వాట్సాప్.. వీటిలో ఇవాళ ఏది చూసినా ఓ పాప‌ వీడియో బాగా వైర‌ల్ అవుతోంది. అంత‌గా ఆ పాప ఏం చేసింది? చిన్నారులు అన‌గానే మ‌న‌కు గుర్తుకొచ్చేది వారి అల్ల‌రి. కానీ, ఈ పాప అందరు చిన్నారుల్లా కాకుండా కాస్త భిన్నంగా వ్య‌వ‌హ‌రించింది. దేశాన్ని కాపాడే సైనికుల వ‌ద్ద‌కు వెళ్ళి వారికి పాదాభివంద‌నం చేసింది.

Viral video: దేశం గ‌ర్విస్తోంది.. విప‌రీతంగా వైర‌ల్ అవుతున్న పాప వీడియో

Army

Viral video: ఫేస్‌బుక్‌, ట్విట‌ర్‌, వాట్సాప్.. వీటిలో ఇవాళ ఏది చూసినా ఓ పాప‌ వీడియో బాగా వైర‌ల్ అవుతోంది. అంత‌గా ఆ పాప ఏం చేసింది? చిన్నారులు అన‌గానే మ‌న‌కు గుర్తుకొచ్చేది వారి అల్ల‌రి. కానీ, ఈ పాప అందరు చిన్నారుల్లా కాకుండా కాస్త భిన్నంగా వ్య‌వ‌హ‌రించింది. దేశాన్ని కాపాడే సైనికుల వ‌ద్ద‌కు వెళ్ళి వారికి పాదాభివంద‌నం చేసింది. ఆ చిన్నారి చేసిన ప‌నిని నెటిజ‌న్లు మెచ్చుకోకుండా ఉండ‌లేక‌పోతున్నారు. బీజేపీ క‌ర్ణాట‌క ఎంపీ పీసీ మోహ‌న్ ఈ పాప వీడియోను పోస్ట్ చేశారు. చిన్నారుల్లో దేశ భ‌క్తిని నింప‌డం త‌ల్లిదండ్రులంద‌రి బాధ్య‌త‌ని ఆయ‌న చెప్పారు.

Maharashtra: ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్ల మార్పు.. ‘మ‌హా’ కేబినెట్ కీల‌క‌ నిర్ణయాలు

దేశాన్ని కాపాడే సైనికులు అంటే చిన్నారుల‌కూ ఎంత‌గా గౌర‌వం ఉందో ఈ వీడియో చూస్తే తెలుస్తోంద‌ని కొంద‌రు నెటిజ‌న్లు కామెంట్లు చేశారు. దేశ సైనికుల‌నే కాకుండా ఇటువంటి చిన్నారుల‌ను కూడా స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఓ నెటిజ‌న్ పేర్కొన్నాడు. ఈ వీడియో చూడ‌గానే క‌ళ్ళ‌లో నీళ్ళు తిరిగాయ‌ని ఓ నెటిజ‌న్ రాసుకొచ్చాడు. ఈ వీడియో చూసి రోమాలు నిక్క‌బొడుచుకున్నాయ‌ని మ‌రో వ్య‌క్తి పేర్కొన్నాడు. సైనికుల‌నే కాకుండా ఈ పాప‌ను చూసి కూడా దేశం గ‌ర్విస్తోందంటూ కొంద‌రు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.