Virat Kohli: ఆసియాకప్‌పైనే కోహ్లీ ఆశలు.. ఎంపిక చేయకపోవచ్చన్న పాక్ మాజీ క్రికెటర్

మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న విరాట్ కు బీసీసీఐ విశ్రాంతి ఇస్తూ వస్తుంది. తాజాగా ప్రకటించిన జింబాబ్వే లో జరిగే వన్డే సిరీస్ లోనూ కోహ్లీకి స్థానం లభించలేదు. ఈక్రమంలో పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆసియా కప్ లోనూ కోహ్లీకి జట్టులో చోటు లభించక పోవచ్చని జోస్యం చెప్పాడు.

Virat Kohli: ఆసియాకప్‌పైనే కోహ్లీ ఆశలు.. ఎంపిక చేయకపోవచ్చన్న పాక్ మాజీ క్రికెటర్

Virat Kohli

Virat Kohli: క్రికెట్ ప్రపంచంలో స్టార్ క్రికెటర్ గా వేగంగా దూసుకొచ్చిన స్టార్ బ్యాటర్, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న విరాట్ కు బీసీసీఐ విశ్రాంతి ఇస్తూ వస్తుంది. ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో కోహ్లీ పరుగులు రాబట్టడంలో విఫలం కావడంతో బీసీసీఐ అతన్ని వెస్టండీస్ టూర్ కు ఎంపిక చేయలేదు, తాజాగా జింబాబ్వే వన్డే సిరీస్ కు ఎంపిక చేసిన జట్టులోనూ కోహ్లీని బీసీసీఐ పక్కన పెట్టింది. ఈ ఏడాది భారత్ జట్టు ఆసియా కప్, టీ20 ప్రపంచ కప్ వంటి పెద్ద టోర్నీల్లో పాల్గోనుంది. అయితే తాజాగా కోహ్లీ ఆశలన్నీ ఆసియా కప్ పైనే ఉన్నాయి.

Virat Kohli: కోహ్లీ ఒక్క 20నిమిషాలు టైమిస్తే సాయం చేస్తా – గవాస్కర్

కోహ్లీని జింబాబ్వేతో జరిగే వన్డే సిరీస్ కు ఎంపిక చేయకపోవటం పట్ల పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. యువ ఆటగాడు ఇషాన్ కిషన్ కు బదులు కోహ్లీని ఎంపిక చేయాల్సిందని అన్నాడు. ప్రస్తుతం జట్టులో వికెట్ కీపర్ గా సంజూ శాంసన్ అద్భుతంగా రాణిస్తున్నాడని, అయినా మరో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ను ఎంపిక చేయడంలో బీసీసీఐ నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. కోహ్లీని ఈ సిరీస్ లో ఎంపిక చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయ పడ్డాడు. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే రాబోయే ఆసియా కప్ కు కూడా విరాట్ ను ఎంపిక చేయకపోవచ్చు అని కనేరియా జోస్యం చెప్పాడు. జట్టులోకి తీసుకొనే విషయంలో కోహ్లీకి బీసీసీఐ అన్యాయం చేస్తుందని నేను భావిస్తున్నానని అన్నాడు.

Kohli: జావెద్‌ మియాందాద్‌తో కోహ్లీని పోల్చిన పాక్ మాజీ కెప్టెన్

ఇదిలాఉంటే.. విరాట్ కోహ్లీ జట్టులోకి పునరాగమనం త్వరలోనే ఉంటుందని ఓ బీసీసీఐ అధికారి పేర్కొన్నట్లు ఓ జాతీయ వార్తా సంస్థ పేర్కొంది. వచ్చే నెల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనున్న ఆసియా కప్ T20 టోర్నమెంట్‌లో భారత మాజీ కెప్టెన్ తిరిగి వస్తాడని ఆయన పేర్కొన్నారు. ఆసియా కప్ నుండి తాను అందుబాటులో ఉంటానని విరాట్ సెలెక్టర్లతో చెప్పినట్లు తెలిసింది. ప్రపంచ T20 ముగిసే వరకు మొదటి శ్రేణి ఆటగాళ్లకు ఆసియా కప్ నుండి విశ్రాంతి లభించదని సదరు బీసీసీఐ అధికారి పేర్కొన్నట్లు ఓ జాతీయ వార్తా సంస్థ పేర్కొంది.