Virat Kohli Reverse Sweep : కోహ్లి ఇలాంటి షాట్లు ఆడడం ఎప్పుడు చూసి ఉండ‌రు.. వీడియో వైర‌ల్‌

వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జూలై 12 నుంచి ఆరంభం కానుంది. ఈ నేప‌థ్యంలో మాజీ కెప్టెన్‌, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి (Virat Kohli ) నెట్స్‌లో బౌల‌ర్ల‌ను ఎదుర్కొంటూ విభిన్న షాట్ల‌ను ప్ర‌య‌త్నిస్తున్నాడు.

Virat Kohli Reverse Sweep : కోహ్లి ఇలాంటి షాట్లు ఆడడం ఎప్పుడు చూసి ఉండ‌రు.. వీడియో వైర‌ల్‌

Virat Kohli Reverse Sweep

Virat Kohli : వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జూలై 12 నుంచి ఆరంభం కానుంది. ఈ నేప‌థ్యంలో టీమ్ఇండియా ఆట‌గాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. మాజీ కెప్టెన్‌, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి (Virat Kohli ) నెట్స్‌లో బౌల‌ర్ల‌ను ఎదుర్కొంటూ విభిన్న షాట్ల‌ను ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఎప్పుడూ సాంప్ర‌దాయ షాట్లు ఆడే విరాట్‌ ఈ సారి మాత్రం ర‌విచంద్ర‌న్‌ అశ్విన్ (Ravichandran Ashwin) బౌలింగ్‌లో రివ‌ర్స్ స్వీప్ ఆడాడు.

ఎడ‌మ‌చేతి వాటం పేస‌ర్ జ‌య‌దేవ్ ఉన‌ద్క‌త్ తో పాటు అశ్విన్‌, ర‌వీంద్ర జ‌డేజా ల‌తో పాటు స్థానిక బౌల‌ర్‌తో క‌లిసి కోహ్లి నెట్స్‌లో సాధ‌న చేశాడు. ఈ న‌లుగురు ఒక‌రి త‌రువాత మ‌రొక‌రు ఒక‌రు బాల్ వేయ‌గా కోహ్లి షాట్ల‌తో అల‌రించాడు. ఈ సెష‌న్‌లో విరాట్ మంచి ట‌చ్‌లో ఉన్న‌ట్లు క‌నిపించాడు. ఈ క్ర‌మంలోనే అశ్విన్ బౌలింగ్ లో అత‌డు రివ‌ర్స్ స్వీప్ షాట్‌ ప్రాక్టీస్ చేశాడు. కోహ్లి ఆడిన షాట్‌కు జ‌డేజా ఫిదా అయ్యాడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Praveen Kumar car accident : కొడుకుతో క‌లిసి వెళుతుండ‌గా.. టీమ్ఇండియా మాజీ క్రికెట‌ర్ వాహ‌నాన్ని ఢీకొట్టిన ట్ర‌క్కు.. నుజ్జు నుజ్జు అయిన‌ కారు..

ఇక యువ ఆట‌గాళ్ల‌కు మార్గ‌నిర్దేశం చేయ‌డంలో కోహ్లి ఎప్పుడూ ముందు ఉంటాడు అన్న సంగ‌తి తెలిసిందే. ఐపీఎల్‌లో ప‌రుగుల వ‌ర‌ద పారించడంతో పాటు దేశ‌వాళీ క్రికెట్‌లో నిల‌క‌డ‌గా ఆడ‌డంతో యువ ఆట‌గాడు య‌శ‌స్వి జైస్వాల్‌కు తొలిసారి టెస్టు జ‌ట్టులో చోటు ద‌క్కింది. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న జైశ్వాల్‌కు కోహ్లి ప‌లు స‌ల‌హాల‌ను ఇచ్చాడు. సీనియ‌ర్ చెప్పే విష‌యాల‌ను జైశ్వాల్ ఎంతో శ్ర‌ద్ద‌గా ఉన్నాడు. కాగా.. రెండు టెస్టుల సిరీస్‌లో తుది జ‌ట్టులో జైశ్వాల్ అరంగ్రేటం చేసే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి.

కోహ్లికి అత్యంత కీల‌కం..

ODI World Cup 2023: వన్డే వరల్డ్ కప్‌‌లో ఆడే అవకాశాన్ని చేజార్చుకున్న జింబాబ్వే.. ఆ రెండు జట్లలో మెగా టోర్నీకి వచ్చేదెవరు?

కొంత‌కాలం పాటు ఫామ్ కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొన్న కోహ్లి ఇటీవ‌ల ఫామ్‌లోకి వ‌చ్చాడు. ప‌లు అద్భుత‌మైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే.. పరిమిత ఓవ‌ర్ల క్రికెట్‌లో రాణించిన‌ప్ప‌టికి టెస్టుల్లో త‌న స్థాయికి త‌గ్గ ఇన్నింగ్స్ ఆడి చాలా రోజులే అయ్యింది. అదే స‌మ‌యంలో వెస్టిండీస్‌లో అత‌డి రికార్డు ఏమంత గొప్ప‌గా లేదు. విండీస్‌లో ఆడిన టెస్టుల్లో కోహ్లి స‌గ‌టు 35.62గా ఉంది. ఓవ‌రాల్‌గా చూసుకున్నా కూడా వెస్టిండీస్ జ‌ట్టుపై 14 టెస్టుల్లో 43.26 స‌గ‌టుతో 822 ప‌రుగులే చేశాడు. దీంతో ఈ సిరీస్‌లో రాణించి డ‌బ్ల్యూటీసీ కొత్త సైకిల్‌ను ఘ‌నంగా ఆరంభించ‌డంతో పాటు త‌న స‌గ‌టును మెరుగుప‌ర‌చుకోవాల‌ని కోహ్లి భావిస్తున్నాడు.