ODI World Cup 2023: వన్డే వరల్డ్ కప్‌‌లో ఆడే అవకాశాన్ని చేజార్చుకున్న జింబాబ్వే.. ఆ రెండు జట్లలో మెగా టోర్నీకి వచ్చేదెవరు?

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023కు క్వాలిఫయర్ మ్యాచ్‌లలో శ్రీలంక ఇప్పటికే అర్హత సాధించింది. రెండో బెర్తు కోసం స్కాట్లాండ్, నెదర్లాండ్‌లు పోటీపడనున్నాయి.

ODI World Cup 2023: వన్డే వరల్డ్ కప్‌‌లో ఆడే అవకాశాన్ని చేజార్చుకున్న జింబాబ్వే.. ఆ రెండు జట్లలో మెగా టోర్నీకి వచ్చేదెవరు?

Zimbabwe Team

ODI World Cup Qualifiers 2023: ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌ 2023 (ICC ODI World cup 2023) లో ఆడే అవకాశాన్ని జింబాబ్వే (Zimbabwe) జట్టు కోల్పోయింది. క్వాలిఫయర్స్ మ్యాచ్‌లో శ్రీలంక (Sri Lanka) జట్టు ఇప్పటికే మెగా టోర్నీ(Mega tournament) కి అర్హత సాధించగా.. ఆ జట్టుతో జింబాబ్వే కూడా అర్హత సాధిస్తుందని క్రికెట్ అభిమానులు భావించారు. కానీ, స్కాట్లాండ్ (Scotland) జింబాబ్వేకు గట్టి షాకిచ్చింది. మంగళవారం జింబాబ్వే, స్కాట్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో అనూహ్యంగా జింబాబ్వే 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఫలితంగా వరుసగా రెండోసారి మెగాటోర్నీలో ఆడే అవకాశాన్ని కోల్పోయింది. సొంతగడ్డపై జరిగిన ప్రపంచకప్ క్వాలిఫయర్స్ లీగ్ దశలో జింబాబ్వే ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన ఇచ్చారు. వెస్టిండీస్ లాంటి పెద్ద జట్టును ఓడించటంతోపాటు ఆడిన పత్రి మ్యాచ్‌లో ఆ జట్టు విజయం సాధించింది. కానీ, చివరిలో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయిన జింబాబ్వే జట్టు వన్డే వరల్డ్ కప్ 2023కు దూరమైంది.

Ajit Agarkar : భారత క్రికెట్ జట్టు సెలక్టర్ల ఛైర్మన్‌గా అజిత్ అగార్కర్

స్కాట్లాండ్ దెబ్బకు వెస్టిండీస్, జింబాబ్వే ఔట్..
మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి జింబాబ్వే ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు 41.1 ఓవర్లలో 203 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా 31 పరుగుల తేడాతో ఓడిపోయి మెగా టోర్నీకి ఆడే అవకాశాన్ని జింబాబ్వే జట్టు చేజార్చుకుంది. స్కాట్లాండ్ జట్టులో లియాస్క్ (48), క్రాస్ (38) పరుగులు చేశారు. జింబాబ్వే జట్టను గెలిపించేందుకు ర్యాన్ బర్ల్ 84 బంతుల్లోనే 83 పరుగులతో చివరి వరకు పోరాడినా ఫలితం దక్కలేదు. స్కాట్లాండ్ జట్టు సూపర్ -6లో వరుసగా వెస్టిండీస్, జింబాబ్వేలను ఓడించి ఆ జట్లను ఇంటిముఖం పట్టించింది.

India vs Kuwait Final: శాఫ్ టైటిల్ భారత్‌దే.. హోరాహోరీ పోరులో కువైట్‌పై విజయం

స్కాట్లాండ్‌ జట్టుకే ఎక్కువ అవకాశాలు..

వన్డే వరల్డ్ కప్ 2023లో మొత్తం పది జట్లు పాల్గొంటున్నాయి. ఇప్పటికే ఎనిమిది జట్లు అర్హత సాధించాయి. మిగిలిన రెండు స్థానాలకోసం శ్రీలంక, జింబాబ్వే, వెస్టిండీస్, స్కాట్లాండ్, నెదర్లాండ్, ఓమన్ జట్లు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే శ్రీలంక వరల్డ్ కప్‌లో ఆడే అవకాశాన్ని దక్కించుకుంది. ఓమన్, వెస్టిండీస్, జింబాబ్వే జట్లు ఇప్పటికే అర్హత కోల్పోయాయి. రెండో బెర్తు కోసం స్కాట్లాండ్, నెదర్లాండ్ జట్లు పోటీ పడ్డాయి.

ODI World Cup Qualifier Super Sixes Points Table

ODI World Cup Qualifier Super Sixes Points Table

పాయింట్ల పట్టికలో జింబాబ్వే ఆరు, స్కాట్లాండ్ ఆరు పాయింట్లతో, నెదర్లాండ్స్ నాలుగు పాయింట్లతో ఉన్నాయి. రన్‌రేట్ ప్రకారం.. జింబాబ్వే మిగిలిన రెండు జట్ల కంటే వెనుకబడి ఉంది. గురువారం స్కాట్లాండ్, నెదర్లాండ్స్ జట్లు తమ చివరి మ్యాచ్ ఆడబోతున్నాయి. ఈ మ్యాచ్‌లో స్కాట్లాండ్ విజయం సాధిస్తే మెగా టోర్నీకి శ్రీలంక జట్టుతో అర్హత సాధిస్తుంది. ఒకవేళ నెదర్లాండ్స్ జట్టు విజయం సాధిస్తే రెండు జట్లు ఆరేసి పాయింట్లతో సమానంగా ఉంటాయి. అప్పుడు నెట్ రన్‌రేట్‌లో స్కాట్లాండ్ ను నెదర్లాండ్స్ అధిగమిస్తేనే మెగా టోర్నీకి నెదర్లాండ్స్ జట్టు అర్హత సాధించిస్తుంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయినా స్కాట్లాండ్‌ వరల్డ్ కప్‌కు అర్హత సాధిస్తుంది. నెదర్లాండ్ వన్డే వరల్డ్ కప్ 2023కు అర్హత సాధించాలంటే స్కాట్లాండ్ పై భారీ విజయాన్ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది.