Virender Sehwag: ఆ ఓటమి ఎంతో బాధించింది.. రెండు రోజులు హోటల్ రూమ్‌లో ఒక్కడినే ఉన్నా.. ఎవ్వరి ముఖాన్ని చూడలేదు
ఆటల్లో గెలుపు, ఓటములు సహజం. చాలా వాటిని మరిచిపోతాం. అయితే.. కొన్ని విజయాలు ఎప్పటికి ఆటగాళ్ల, అభిమానుల మదిలో నిలిచిపోతుంటాయి. మరికొన్ని ఓటములు మాత్రం చేదు జ్ఞాపకాలుగా మిగిలిపోతుంటాయి.

Virender Sehwag
Sehwag: ఆటల్లో గెలుపు, ఓటములు సహజం. చాలా వాటిని మరిచిపోతాం. అయితే.. కొన్ని విజయాలు ఎప్పటికి ఆటగాళ్ల, అభిమానుల మదిలో నిలిచిపోతుంటాయి. మరికొన్ని ఓటములు మాత్రం చేదు జ్ఞాపకాలుగా మిగిలిపోతుంటాయి. టీమ్ఇండియా అభిమానులకు అలాంటి ఓ చేదు జ్ఞాపకమే 2007 వన్డే ప్రపంచకప్(2007 World Cup). ఈ ప్రపంచకప్ ఓటమిని భారత అభిమానులే కాదు ఆటగాళ్లు కూడా అంత త్వరగా మరిచిపోలేరు.
తాజాగా నాటి చేదు జ్ఞాపకాల గురించి టీమ్ఇండియా మాజీ ఆటగాడు, విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) గుర్తు చేసుకున్నాడు. ప్రపంచకప్‌లో ఘోర ఓటమి నేపథ్యంలో ఆ సమయంలో తాను రెండు రోజుల పాటు హోటల్‌లోని రూమ్‌కే పరిమితమైనట్లు వెల్లడించాడు. ఏ ఒక్కరి ముఖాన్ని చూసేందుకు కూడా ఇష్టపడలేదట. అప్పట్లో తాను అనుభవించిన బాధను తెలియజేశాడు.
2007 వన్డే ప్రపంచకప్‌లో బలమైన జట్టుతో బరిలోకి దిగింది టీమ్ఇండియా. 2003 వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్ చేరడం, జట్టులో హేమాహేమీ బ్యాటర్లు ఉండడంతో ఖచ్చితంగా కప్ గెలుస్తుందని అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ అనూహ్యంగా లీగ్ దశలోనే వెనక్కి వచ్చేసింది. గ్రూప్ స్టేజీలో మూడు మ్యాచ్‌లు ఆడిన భారత్.. తొలి మ్యాచ్‌లో పసికూన బంగ్లాదేశ్ చేతిలో షాకింగ్ ఓటమిని చవిచూసింది. రెండో మ్యాచులో బెర్ముడాపై భారీ తేడాతో గెలిచింది. నౌకౌట్ స్టేజ్‌కు చేరాలంటే మూడో మ్యాచులో శ్రీలంక పై విజయం సాధించడం తప్పని సరి. అయితే.. ఓడిపోయి ఇంటి ముఖం పట్టింది.
ఇలా భారత జట్టు గ్రూప్ స్టేజ్‌లోనే టోర్నీ నుంచి నిష్ర్కమించడం తనను ఎంతో బాధించిందని సెహ్వాగ్ తెలిపాడు. ‘ఎందుకంటే 2007లో ప్రపంచంలోనే మా టీమ్ బెస్ట్‌గా ఉండేది. మూడు మ్యాచుల్లో రెండు ఓడిపోవడం బాధించింది. మేం తరువాతి దశకు చేరుకుంటామని అందరూ అనుకున్నారు. అయితే లీగ్ స్టేజ్‌లోనే ఓడిపోయాం. ఆ తరువాత టికెట్లు అందుబాటులో లేకపోవడంతో భారత్‌కు వచ్చేందుకు రెండు రోజుల పాటు ట్రినిడాడ్ అండ్ టొబాగోలొ ఉండాల్సి వచ్చింది. ఏం చేయాలో అర్థం కాలేదు. మా హోటల్‌లో రూమ్ సర్వీస్ చేసే వాళ్లు లేరు. నేను కూడా హౌస్ కీపింగ్ కోసం ఎవ్వరిని పిలవలేదు. ఆ రెండు రోజులు నేను నా గది నుంచి బయటకు అడుగుపెట్టలేదు. ఆ రెండు రోజులు ‘ప్రిజన్ బ్రేక్’ సిరీస్ మొత్తం చేశాను. ఆ సమయంలో ఎవ్వరి ముఖాన్ని కూడా చూడలేదు.’ అనీ సెహ్వాగ్ నాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నాడు.
Ruturaj Gaikwad: ప్రేయసిని పెళ్లాడిన టీమ్ఇండియా క్రికెటర్.. ఫోటోలు వైరల్.. ఆమె కూడా క్రికెటరే