Virupaksha: 10 రోజుల్లో 76.. టార్గెట్ సెంచరీ దిశగా విరూపాక్ష పరుగు!

టాలీవుడ్ లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’ సాలిడ్ రన్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ సినిమా 10 రోజుల్లో ఏకంగా రూ.76 కోట్ల వసూళ్లతో దుమ్ములేపింది.

Virupaksha: 10 రోజుల్లో 76.. టార్గెట్ సెంచరీ దిశగా విరూపాక్ష పరుగు!

Virupaksha 10 Days Collections Are Solid

Updated On : May 1, 2023 / 12:46 PM IST

Virupaksha: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ సెన్సేషన్ ‘విరూపాక్ష’ రిలీజ్ అయ్యి 10 రోజులు అవుతున్నా, థియేటర్స్‌లో సత్తా చాటుతూనే ఉంది. ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ దండు డైరెక్ట్ చేయగా, పూర్తి మిస్టిక్ థ్రిల్లర్ మూవీగా ఈ చిత్రాన్ని రూపొందించారు. కాగా, ఈ సినిమాలోని హార్రర్ అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి.

Virupaksha: యూఎస్‌లో తగ్గని విరూపాక్ష జోరు.. మరో మైల్‌స్టోన్ కన్ఫం..!

ఇక ఈ సినిమాకు అన్నిచోట్లా పాజిటివ్ రెస్పాన్స్ దక్కడంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమా తొలిరోజునే మంచి వసూళ్లు సాధించగా, సినిమాకు వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ వల్ల ఈ కలెక్షన్స్ కంటిన్యూ అవుతూ వచ్చాయి. ఇక ఈ సినిమా తాజాగా 10 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకోగా, ఈ సినిమాకు వరల్డ్‌వైడ్‌గా రూ.76 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లుగా చిత్ర యూనిట్ వెల్లడించింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఎంగేజింగ్ సినిమాలేవీ లేకపోవడంతో ఈ వారం కూడా విరూపాక్షకు బాగా కలిసి రానుంది.

Virupaksha : పాన్ ఇండియా రిలీజ్‌కి సిద్దమైన విరూపాక్ష..

దీంతో ఈ సినిమా త్వరలోనే రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరడం ఖాయమని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాతో సాలిడ్ కమ్‌బ్యాక్ ఇచ్చాడని.. అటు అందాల భామ సంయుక్త మీనన్ ఈ సినిమాలో చేసిన పర్ఫార్మెన్స్ ఆమె కెరీర్ బెస్ట్‌గా ఉందని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి బివిఎస్ఎన్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేశారు.