Dhamki Release Date: విశ్వక్ సేన్ ‘ధమ్కీ’ ఇచ్చేందుకు డేట్ ఫిక్స్ చేశాడు!

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ధమ్కీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో మరోసారి మాస్ అవతారంలో విశ్వక్ సేన్ తనదైన పాత్రలో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్లు ఇప్పటికే రిలీజ్ అయ్యి ప్రేక్షకుల్లో ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యేలా చేశాయి.

Dhamki Release Date: విశ్వక్ సేన్ ‘ధమ్కీ’ ఇచ్చేందుకు డేట్ ఫిక్స్ చేశాడు!

Vishwak Sen Dhamki Release Date Locked

Dhamki Release Date: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ధమ్కీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో మరోసారి మాస్ అవతారంలో విశ్వక్ సేన్ తనదైన పాత్రలో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్లు ఇప్పటికే రిలీజ్ అయ్యి ప్రేక్షకుల్లో ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యేలా చేశాయి.

Dhamki : ధమ్కీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సందడి చేసిన బాలయ్య బాబు..

ఇక ఈ సినిమాను విశ్వక్ సేన్ స్వయంగా డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా, ఇది మ్యాచో స్టార్ గోపీచంద్ నటించిన ‘గౌతమ్ నంద’ను పోలి ఉందని పలు కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపించాయి. కానీ ఈ సినిమా కంటెంట్ సరికొత్తగా ఉంటుందని విశ్వక్ సేన్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ లాక్ చేసింది.

Dhamki Trailer: ధమ్కీ ట్రైలర్.. క్లాస్ కోసం మాస్.. ఊరమాస్!

ధమ్కీ చిత్రాన్ని ఫిబ్రవరి 17న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఇక ఈ సినిమాలో అందాల భామ నివేథా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, రావు రమేశ్, హైపర్ ఆది, రోహిని, పృథ్వీరాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కరాటే రాజుతో కలిసి విశ్వక్ సేన్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండగా, లియోన్ జేమ్స్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.