Balakrishna – Vishwak Sen : విశ్వక్ సేన్ డైరెక్షన్‌లో బాలయ్య బాబు?

నందమూరి నటసింహ బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ విజయాల్ని అందుకొని మంచి ఊపు మీద ఉన్నాడు. ఈ హీరో నటించిన తాజా చిత్రం 'వీరసింహారెడ్డి' బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల ఊచకోత కోసింది. దీంతో నిన్న వీరసింహుని విజయోత్సవం సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ ఈవెంట్ లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ..

Balakrishna – Vishwak Sen : విశ్వక్ సేన్ డైరెక్షన్‌లో బాలయ్య బాబు?

Balakrishna - Vishwak Sen

Balakrishna – Vishwak Sen : నందమూరి నటసింహ బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ విజయాల్ని అందుకొని మంచి ఊపు మీద ఉన్నాడు. ఈ హీరో నటించిన తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల ఊచకోత కోసింది. ఈ సినిమాకి ముందు వచ్చిన ‘అఖండ’ బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టు నిలవగా.. ఈ మూవీ లైఫ్‌టైమ్ కలెక్షన్లను కేవలం ఎనిమిది రోజుల్లోనే క్రాస్ చేసి వీరసింహారెడ్డి వీర విహారం చేసింది. యూఎస్‌ఏ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా 1 మిలియన్ గ్రాస్ కలెక్షన్స్ సాధించి సంచలనం సృష్టించింది. దీంతో చిత్ర యూనిట్ నిన్న వీరసింహుని విజయోత్సవం సెలబ్రేషన్స్ నిర్వహించారు.

Veera Simha Reddy : ఒక డైలాగ్ నుంచి వీరసింహారెడ్డి కథ పుట్టింది.. ఆ డైలాగ్ ఏంటో తెలుసా?

హైదరాబాద్ జేఆర్‌సీ కన్వేషన్ హాల్ లో జరిగిన ఈ ఈవెంట్ కి చిత్ర యూనిట్ తో పాటు టాలీవుడ్ యువ హీరోలు విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, హను రాఘవపూడి, శివ నిర్వాణ ముఖ్య అథిలుగా హాజయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. బాలకృష్ణ సార్ నా సినిమా ధమ్కీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఆ తరువాత అన్‌స్టాపబుల్ షోకి పిలిచారు. అక్కడితో మా జర్నీ అయ్యిపోయింది. కానీ ఒక రోజు ఏ పని లేకుండా బాలకృష్ణ సార్ నాకు ఫోన్ చేసి బ్రో ఎలా ఉన్నావు అని అడిగారు. అది బాలయ్య అంటే. ఇండస్ట్రీలోకి వచ్చి ఏమి సాదించావు అని అడిగితే నేను బాలకృష్ణ సార్ ‘బ్రో ప్రేమని’ సాధించా అని చెబుతా.

ఇంకో విషయం సార్.. మీకు తెలియదు గాని మీకు ఇంకా ఎంతోమంది కొత్త ఫ్యాన్స్ పుడుతున్నారు ఇప్పటి జెనరేషన్‌లో. చివరిగా ఒకటి అడుగుతున్నా ఈ మాస్ కా దాస్ కి ఛాన్స్ ఇస్తే మీ గాడ్ అఫ్ మాసస్ ని మొగుడు అఫ్ మాసస్ చేస్తా అంటూ బాలయ్యని డైరెక్ట్ చేసే ఛాన్స్ అడిగాడు. మరి కొత్తదనాన్ని ప్రోత్సహించే బాలయ్య, విశ్వక్ సేన్ కి అవకాశం ఇస్తాడా? లేదా? అనేది చూడాలి.