Vivo V27 Series : వివో V27 సిరీస్ వచ్చేస్తోంది.. మార్చి 1నే లాంచ్.. ఫీచర్లు ఇవేనా? ధర ఎంత ఉండొచ్చుంటే?

Vivo V27 Series : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఇదే సరైన సమయం.. కొద్దిరోజుల్లో అంటే.. మార్చి 01, 2023న భారత మార్కెట్ సహా ప్రపంచవ్యాప్తంగా Vivo V27 Series స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. ఈ మేరకు చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం (Vivo) అధికారికంగా ప్రకటించింది.

Vivo V27 Series : వివో V27 సిరీస్ వచ్చేస్తోంది.. మార్చి 1నే లాంచ్.. ఫీచర్లు ఇవేనా? ధర ఎంత ఉండొచ్చుంటే?

Vivo V27 Series to launch on March 1_ What we know so far

Vivo V27 Series : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఇదే సరైన సమయం.. కొద్దిరోజుల్లో అంటే.. మార్చి 01, 2023న భారత మార్కెట్ సహా ప్రపంచవ్యాప్తంగా Vivo V27 Series స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. ఈ మేరకు చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం (Vivo) అధికారికంగా ప్రకటించింది. కంపెనీ ట్వీట్ ప్రకారం.. లాంచ్ IST మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించనుంది. గొప్ప డిజైన్‌తో పాటు ఆకట్టుకునే ఫీచర్లు ఉండనున్నాయి. ఈ అద్భుతమైన డిజైన్‌ను చూసేందుకు మీ తేదీని సేవ్ చేసుకోండి. కొత్త #vivoV27Series స్మార్ట్‌ఫోన్‌ కోసం రెడీగా ఉండండి. మార్చి 1, 2023న, మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుందని వివో ఇండియా ట్వీట్ చేసింది.

నివేదికల ప్రకారం.. రాబోయే (Vivo V27 Series) ఫస్ట్ కలర్-చేంజ్ బ్యాక్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ డివైజ్ కేవలం 7.4mm మందంగా స్లిమ్‌గా ఉన్నాయని పొందింది. #vivoV27Series కలర్ ఛేంజింగ్ గ్లాస్ డిజైన్‌తో స్పాట్‌లైట్‌తో రానుందని అని కంపెనీ ట్వీట్ చేసింది. ఇంతలో #vivoV27Series కలర్ ఛేంజింగ్ గ్లాస్ డిజైన్‌తో రానుందని మరొక ట్వీట్ తెలిపింది.

Vivo V27 సిరీస్‌లోని డివైజ్‌లు 120Hz అధిక రిఫ్రెష్ రేట్‌తో 3D కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటాయని తెలిపింది. అన్ని ఎడ్జ్‌ల నుంచి డిజైన్ అద్భుతంగా ఉండనుంది. అన్ని కొత్త Vivo V27 సిరీస్ లీనమయ్యే 120Hz 3D కర్వ్డ్ డిస్‌ప్లేతో పాటు అల్ట్రా స్లిమ్ డిజైన్‌తో రానుందని Vivo ఇండియా ట్వీట్ చేసింది.

Vivo V27 Series to launch on March 1_ What we know so far

Vivo V27 Series to launch on March 1

Read Also : UPI Payments : యూపీఐ పేమెంట్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. సేఫ్ ఆన్‌లైన్ పేమెంట్స్ కోసం ఈ 5 UPI టిప్స్ తప్పక పాటించండి..!

Vivo V27 సిరీస్ అధికారిక ధర వివరాలు ఇంకా వెల్లడించలేదు. Vivo V27 సిరీస్ ప్రారంభ ధర సుమారు రూ. 30వేల ఉండొచ్చునని నివేదిక తెలిపింది. Vivo సిరీస్ ఎమరాల్డ్ గ్రీన్, మ్యాజిక్ బ్లూ, నోబుల్ బ్లాక్, ఫ్లోయింగ్ గోల్డ్‌తో సహా 4 విభిన్న రంగు ఆప్షన్లలో రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉంది.

ఎమరాల్డ్ గ్రీన్, మ్యాజిక్ బ్లూ వేరియంట్‌లు ప్రత్యేకమైన రంగును మార్చే బ్యాక్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. లైట్ నుంచి డార్క్ గ్రీన్, బ్లూకి మారుతుంటాయి. నాలుగు రంగుల్లో కొన్ని మార్కెట్‌లలో అందుబాటులో ఉన్నప్పటికీ, భారత్‌లో ఎమరాల్డ్ గ్రీన్, మ్యాజిక్ బ్లూ వేరియంట్‌లను మాత్రమే రిలీజ్ చేయనున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి.

అదనంగా, ఈ ఫోన్ 1/1.56-అంగుళాల సోనీ IMX766V సెన్సార్, OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) టెక్నాలజీతో వస్తుందని భావిస్తున్నారు. రాబోయే Vivo V27 Pro వేరియంట్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల FHD+ డిస్‌ప్లే,ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని నివేదికలు సూచిస్తున్నాయి. MediaTek Dimensity 8200 చిప్‌సెట్‌తో 12GB RAM, 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుందని భావిస్తున్నారు. Vivo V27 Pro Android 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుందని భావిస్తున్నారు. మరోవైపు, Vivo V27 50MP ప్రైమరీ సెన్సార్‌తో, MediaTek Dimensity 7200 ప్రాసెసర్‌తో వస్తుందని భావిస్తున్నారు. అదనంగా, రెండు ఫోన్‌లు 66W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్టు ఇస్తుందని భావిస్తున్నారు.

Read Also : Alexa Male Voice : అమెజాన్ అలెక్సాకు ఐదేళ్లు.. భారతీయ యూజర్లు అలెక్సాలో ‘మేల్ వాయిస్‌’కు మార్చుకోవచ్చు..!