Delhi : బ్రిటిష్ హై కమిషనర్‌‌గా వ్యవహరించాలని అనుకుంటున్నారా ?

గెలుపొందిన వారికి బ్రిటిష్ హై కమిషనర్ గా ఒకరోజు సేవలు అందించేలా అవకాశం కల్పించనున్నారు. ఓ అంశంపై అభిప్రాయాలు వెల్లడించి...వీడియో రూపంలో వారికి పంపించాల్సి ఉంటుంది.

Delhi : బ్రిటిష్ హై కమిషనర్‌‌గా వ్యవహరించాలని అనుకుంటున్నారా ?

India British

British High Commissioner : బ్రిటిష్ హై కమిషనర్ గా వ్యవహరించాలని అనుకుంటున్నారా ? అయితే..ఇది మగవారికి మాత్రం కాదు. అమ్మాయిలకు మాత్రమే. ఓ పోటీ నిర్వహించి..అందులో గెలుపొందిన వారికి బ్రిటిష్ హై కమిషనర్ గా ఒకరోజు సేవలు అందించేలా అవకాశం కల్పించనున్నారు. ఓ అంశంపై అభిప్రాయాలు వెల్లడించి…వీడియో రూపంలో వారికి పంపించాల్సి ఉంటుంది. వచ్చిన వీడియోలన్నింటినీ పరిశీలించి..విజేత ఎవరో ప్రకటిస్తారు. ఆ విజేత ఒకరోజు బ్రిటిష్ హై కమిషనర్ గా పనిచేయవచ్చు.

Read More : UNO : అఫ్ఘాన్‌కు ఐక్యరాజ్యసమితి 2 కోట్ల డాలర్ల ఆర్థికసాయం

ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పులతో వస్తున్న సవాళ్లను ఎదుర్కోవడంలో యువత ఎలా తోడ్పాటు అందిస్తుంది..అనే అంశంపై యువతులకు పోటీలు నిర్వహించాలని భారత్ లోని బ్రిటిష్ హై కమిషన్ నిర్ణయం తీసుకుంది. 18 నుంచి 23 సంవత్సరాలున్న అమ్మాయిలు ఈ పోటీలో పాల్గొనాలని సూచించింది.

Read More : IMD : వాతావరణ శాఖ హెచ్చరిక, భారీ వర్షాలు కురిసే ఛాన్స్

అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా…ఈ పోటీని నిర్వహిస్తున్నట్లు హై కమిషనర్ కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇచ్చిన అంశంపై తమ అభిప్రాయాన్ని వీడియో రూపంలో పంపించాలని, ట్విట్టర్, ఇన్ స్ట్రాగ్రాం, ఫేస్ బుక్ లలో #DayoftheGirlను ఉపయోగించి…@UKIndiaకు ట్యాగ్ చేయాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 22వ తేదీలోగా పంపాలని భారత్ బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిన్ వెల్లడించారు. 2017 నుంచి ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.