IMD : వాతావరణ శాఖ హెచ్చరిక, భారీ వర్షాలు కురిసే ఛాన్స్

వాయుగుండం ప్రభావంతో..రాష్ట్రంలో 2021, సెప్టెంబర్ 14వ తేదీ మంగళవారం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని..హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

IMD : వాతావరణ శాఖ హెచ్చరిక, భారీ వర్షాలు కురిసే ఛాన్స్

Tg Rain

Rainfall Telangana State : మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజుల క్రితం…తెలంగాణను అతి నుంచి భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. రైతులకు తీరని నష్టం వాటిల్లింది. వాగులు, వంకలు పొంగి పొర్లడంతో పలువురు గల్లంతు కాగా..మరికొందరు మృత్యువాత పడ్డారు. తాజాగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Read More : Ganesh Immersion : హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో తెలంగాణ ప్రభుత్వం

వాయుగుండం ప్రభావంతో..రాష్ట్రంలో 2021, సెప్టెంబర్ 14వ తేదీ మంగళవారం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని..హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడిన వాయుగుండం బలపడి…తీవ్ర వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. సోమవారం ఉదయం ఉత్తర కోస్తా ఒడిశా వద్ద చాంద్ బలీకి పశ్చిమ వాయువ్య దిశగా…20 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టు పేర్కొన్నారు.

Read More : Dalitha Bandhu : 2, 3 వారాల్లోనే కుటుంబానికి రూ.10లక్షలు.. కొత్తగా మరో 4 మండలాల్లో

48 గంటల్లో ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్ గడ్, మధ్యప్రదేశ్ మీదుగా…ప్రయాణించి…24 గంటల్లో బలహీనపడే అవకాశం ఉందన్నారు. పశ్చిమ దిశ నుంచి కిందిస్థాయి గాలులు వీస్తున్నట్లు, దీని ప్రభావం వల్ల…మంగళవారం పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇదిలా ఉంటే… మహారాష్ట్ర మరోసారి మునిగింది. గుజరాత్‌ వరుణుడి దెబ్బకు బెంబేలెత్తిపోతోంది. ఇటు ఒడిశా గజగజలాడుతోంది. వాయుగుండం ప్రభావంతో ఒడిశా వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. వరదలకు లోతట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి.

Read More : Afghanistanculture : ‘మావస్త్రధారణ జోలికొస్తే సహించేది లేదు’..మా దుస్తులే మా గళం

ఇండ్లలోకి వ‌ర‌ద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గుజరాత్‌ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రాజ్‌కోట్‌లో వాన నీటితో రోడ్లన్నీ కాల్వల్లా మారిపోయాయి. మ‌హారాష్ట్రలోని నాసిక్‌ జిల్లాలో గ‌త వారం రోజులుగా ఎడ‌తెర‌పి లేకుండా వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఒడిశాలోని భద్రుకా జిల్లా చంద్రబాలి దగ్గర తీవ్రవాయుగుండం తీరం దాటింది. దీని ప్రభావంతో దేశంలోని ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని భార‌త వాతావ‌ర‌ణ శాఖ‌ వెల్లడించింది.