Hyderabad Rains: అయ్యయ్యో దొరక్కపాయె! హైదరాబాద్‌లో వరద నీటిలో కొట్టుకుపోయిన వాషింగ్ మిషన్.. వీడియో వైరల్
హైదరాబాద్‌లో వర్షం వస్తుందంటేనే ప్రజలు భయపడుతుంటారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించాల్సిందే. కొద్దిపాటి వర్షం వచ్చినా పలు ప్రాంతాల్లో రహదారులు కాల్వలను తలపిస్తుంటాయి. తాజాగా కురిసిన వర్షానికి వరదనీటిలో వాషింగ్ మిషన్ కొట్టుకుపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది...

Hyderabad Rains: హైదరాబాద్‌లో వర్షం వస్తుందంటేనే ప్రజలు భయపడుతుంటారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించాల్సిందే. కొద్దిపాటి వర్షం వచ్చినా పలు ప్రాంతాల్లో రహదారులు కాల్వలను తలపిస్తుంటాయి. ఆ వరద ఉధృతికి రోడ్డుపై నిలిపిన ద్విచక్ర వాహనాలుసైతం కొట్టుకుపోతుంటాయి. ఇక భారీ వర్షం వస్తే.. రోడ్లుపై ప్రవహించే వరద ఉధృతికి మనుషులు కూడా నిలబడలేరు.
Hyderabad Heavy Rain : హైదరాబాద్‌ను వెంటాడుతున్న వరుణుడు.. మళ్లీ భారీ వర్షం
గత వారం రోజులుగా హైదరాబాద్ లో వర్షాలు కురుస్తున్నాయి. సాయంత్రం వేళల్లో రోజూ వర్షం దంచికొడుతోంది. తాజాగా కురిసిన వర్షానికి యూసఫ్‌గూడ పరిధిలోని కృష్ణానగర్ రోడ్డులో భారీగా వరద నీరు పరుగులు పెట్టింది. ఈ ప్రాంతంలో చిన్న వర్షం వస్తేనే మోకాళ్లలోతు మేర వరద నీరు ప్రవహిస్తుంది. ఇక భారీ వర్షం పడితే పెద్ద కాల్వను తలపిస్తుంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షంకు పలు వస్తువులు కొట్టుకుపోయాయి.
యూసఫ్ గూడ కృష్ణా నగర్ లో వాషింగ్ మిషన్ రిపేర్ షాప్ నుంచి కొట్టుకుపోతున్న పాత మిషన్ పట్టుకునేందుకు షాపు యువకుడి విఫలయత్నం. అయ్యో #HyderabadRains.
#Hyderabad #Floods #Rains #Telangana #WashingMachine pic.twitter.com/TxXStsqUvQ— Vidya Sagar Gunti (@GVidya_Sagar) July 29, 2022
వరద దాటికి రహదారిపై నిలిపిన మోటార్ బైక్ లు సైతం కొట్టుకుపోయాయి. అదే వీధిలో వాషింగ్ మిషన్ల రిపేరు షాపు ఉంది. దీంతో యాజమాని వాషింగ్ మిషన్ ను షాపు మెట్లపై ఉంచాడు. ఒక్కసారిగా భారీ వర్షం పడి నిమిషాల వ్యవధిలోనే వరదనీరు పోటెత్తింది. ఆ వరదలో వాషింగ్ మిషన్ కొట్టుకుపోయింది. ఈ క్రమంలో ఓ యువకుడు దానిని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను స్థానిక వ్యక్తి తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. వీడియో వైరల్ గా మారింది. ‘హైదరాబాద్‌లో వరదలంటే అట్లానే ఉంటయ్ మరి’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.