India vs England: సెమీఫైనల్ మ్యాచులో విఫలమైన కేఎల్ రాహుల్ పై ట్రోలింగ్

అడిలైడ్ ఓవల్ లో ఇవాళ జరిగిన టీ20 ప్రపంచ కప్ రెండో సెమీఫైనల్ మ్యాచులోనూ టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ రాణించలేకపోవడంతో అతడిని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. సెమీఫైనల్ మ్యాచులో కేఎల్ రాహుల్ రెండో ఓవర్లోనే వెనుదిరిగాడు. అతడు కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్ లో జోస్ బట్లర్ కు సింపుల్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

India vs England: సెమీఫైనల్ మ్యాచులో విఫలమైన కేఎల్ రాహుల్ పై ట్రోలింగ్

India vs England: అడిలైడ్ ఓవల్ లో ఇవాళ జరిగిన టీ20 ప్రపంచ కప్ రెండో సెమీఫైనల్ మ్యాచులోనూ టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ రాణించలేకపోవడంతో అతడిని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. సెమీఫైనల్ మ్యాచులో కేఎల్ రాహుల్ రెండో ఓవర్లోనే వెనుదిరిగాడు. అతడు కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్ లో జోస్ బట్లర్ కు సింపుల్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

మొత్తం 5 బంతులు ఆడి ఒక ఫోరు సాయంతో 5 పరుగులు చేశాడు. ప్రస్తుతం టీ20 ప్రపంచ కప్ లో అతడు పాక్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ పై కనీసం రెండంకెల స్కోరు చేయలేకపోయాడు. ఆ మూడు జట్లతో జరిగి మ్యాచుల్లో వరుసగా 4, 9, 5 పరుగులు చేశాడు.

దీంతో కేఎల్ రాహుల్ ఇవాళ ఔట్ కాగానే ట్రోలర్లు సామాజిక మాధ్యమాల్లో అతడిపై మీమ్స్ సృష్టించారు. కాగా, టీమిండియాను ఓడించిన ఇంగ్లండ్ ఫైనల్ కు చేరింది. మరోవైపు నిన్న న్యూజిలాండ్ ను ఓడించిన పాకిస్థాన్ ఫైనల్ కు దూసుకెళ్లింది. పాక్-ఇంగ్లండ్ మధ్య ఈ నెల 13న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.