India vs New Zealand: టీమిండియా ఆత్మపరిశీలన చేసుకోవాలి: ఓటమిపై శ్రేయాస్ అయ్యర్

‘‘నేటి మ్యాచులో కొన్ని అంశాలు మాకు అనుకూలంగా లేవు. టీమిండియా ఆత్మపరిశీలన చేసుకుని, తదుపరి రెండు వన్డేల్లో మరింత ప్రభావవంతంగా ఆడాలి. మేము ఆడిన పరిస్థితుల్లో 307 పరుగులు చేయడం ప్రశంసనీయమే. కొన్ని అంశాలు మాకు అనుకూలంగా లేనప్పటికీ వాటి నుంచి నేర్చుకోవాల్సి ఉంది. ఆత్మ పరిశీలన చేసుకుని, కొత్త ఐడియాలతో రావాలి’’ అని శ్రేయాస్ అయ్యర్ అన్నాడు.

India vs New Zealand: టీమిండియా ఆత్మపరిశీలన చేసుకోవాలి: ఓటమిపై శ్రేయాస్ అయ్యర్

India vs New Zealand

India vs New Zealand: భారత్-న్యూజిలాండ్ మధ్య ఇవాళ ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ లో జరిగిన తొలి వన్డే మ్యాచులో కివీస్ కు భారత్ 307 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ శిఖర్ ధావన్ సేన ఓడిపోవడంపై బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్ స్పందించాడు. నేటి మ్యాచులో శ్రేయాస్ 76 బంతుల్లో 80 పరుగులు, శిఖర్ ధావన్ 77 బంతుల్లో 72 పరుగులు తీశారు.

‘‘నేటి మ్యాచులో కొన్ని అంశాలు మాకు అనుకూలంగా లేవు. టీమిండియా ఆత్మపరిశీలన చేసుకుని, తదుపరి రెండు వన్డేల్లో మరింత ప్రభావవంతంగా ఆడాలి. మేము ఆడిన పరిస్థితుల్లో 307 పరుగులు చేయడం ప్రశంసనీయమే. కొన్ని అంశాలు మాకు అనుకూలంగా లేనప్పటికీ వాటి నుంచి నేర్చుకోవాల్సి ఉంది. ఆత్మ పరిశీలన చేసుకుని, కొత్త ఐడియాలతో రావాలి’’ అని శ్రేయాస్ అయ్యర్ అన్నాడు.

తొలి మ్యాచు ఓడిపోవడంతో తదుపరి రెండు మ్యాచుల్లో గెలుపుకోసం లీనమై ఆడడం కష్టమని, ఆలోచనలను మార్చుకుని సానుకూల దృక్పథంతో ఆడాల్సి ఉంటుందని చెప్పాడు. నేరుగా భారత్ నుంచి న్యూజిలాండ్ కు వచ్చి ఇక్కడ ఆడడం అంత సులువేమీ కాదని అన్నాడు. మానసికంగా శక్తిమంతంగా ఉండాలని చెప్పాడు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..