Raj Kundra Shilpa Shetty : పోర్న్ చిత్రాల కేసు.. భర్తతో గొడవపడిన శిల్పాశెట్టి

పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. రాజ్ కుంద్రా అరెస్ట్ వ్యవహారం బాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపింది. కాగా, కేసు విచారణలో భాగంగా శిల్పాశెట్టి ఇంట్లో

Raj Kundra Shilpa Shetty : పోర్న్ చిత్రాల కేసు.. భర్తతో గొడవపడిన శిల్పాశెట్టి

Raj Kundra Shilpa Shetty

Raj Kundra Shilpa Shetty : పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. రాజ్ కుంద్రా అరెస్ట్ వ్యవహారం బాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపింది. కాగా, కేసు విచారణలో భాగంగా శిల్పాశెట్టి ఇంట్లో పోలీసుల సోదాల సమయంలో చాలానే జరిగింది. శిల్పాశెట్టి తన భర్తపై తీవ్రంగా మండిపడింది. ఇదంతా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అని భర్తపై గట్టిగట్టిగా కేకలు వేసింది. అంతేకాదు బోరున విలపించిందని సమాచారం. అదే సమయంలో పోలీసులతో రాజ్ కుంద్రాను చూసి శిల్పా తట్టుకోలేకపోయింది. నా భర్త అమాయకుడని అరిచింది.

పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు.. విచారణలో భాగంగా తొలిసారి రాజ్ కుంద్రాను ఆయన ఇంటికి తీసుకెళ్లారు. ఆ సమయంలో శిల్పా ఏడ్చేసింది. మన దగ్గర అన్నీ ఉన్నాయి. ఇదంతా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని రాజ్ కుంద్రాను నిలదీసింది. భర్తను చూసిన శిల్పా కంటతడి పెట్టుకుంది. కుటుంబం పరువు మొత్తం పోయిందని వాపోయింది. పరిశ్రమలో చేసుకున్న ఒప్పందాలన్నీ రద్దు అయ్యాయని, అనేక ప్రాజెక్టులు వదులుకోవాల్సి వచ్చిందని శిల్పాశెట్టి ఆవేదన వ్యక్తం చేసింది. అదే సమయంలో ఆర్థికంగా జరిగిన నష్టం గురించి కూడా ప్రస్తావించింది. శిల్పా ఇంట్లో ఆరు గంటల పాటు పోలీసులు సోదాలు నిర్వహించారు.

ముంబై క్రైమ్ బ్రాంచ్ కి తన స్టేట్ మెంట్ ఇచ్చే సమయంలోనూ తన భర్తతో శిల్పా వాగ్వాదానికి దిగింది. ఆ తర్వాత బోరున ఏడ్చేసింది. పోర్నోగ్రఫీ కేసు విచారణలో భాగంగా గత శుక్రవారం క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శిల్పా, రాజ్ కుంద్రాలకు చెందిన జూహు బంగ్లాలో రైడ్స్ నిర్వహించారు. కాగా, భర్త
నిర్వహిస్తున్న కంపెనీలో తనకు ఎలాంటి ప్రమేయం లేదని పోలీసులతో శిల్పా చెప్పింది. అసలు హాట్ షాట్స్ యాప్ లో కంటెంట్ గురించి తనకేమీ తెలియదంది. ఎరోటికా వేరు పోర్న్ వేరు అన్న శిల్పాశెట్టి.. తన భర్త పోర్న్ కంటెంట్ ప్రొడ్యూస్ చేయలేదని వాదిస్తోంది.

పోర్న్ చిత్రాల కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రాజ్ కుంద్రాను జూలై 19న అరెస్ట్ చేశారు. రాజ్ కుంద్రా ఇంట్లో పలు ఫైళ్లు, ఇమేజ్ లు, వీడియోలు(చాలా వరకు అడల్ట్ కంటెంట్) సీజ్ చేశారు. విదేశానికి చెంది ఓ బ్యాంకులో రాజ్ కుంద్రాకు ఖాతా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.