Shiv Sena : శివసేన ఎవరి సొంతం?

శివసేన పార్టీ తమదేనని షిండే క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఉద్ధవ్‌ ఠాక్రేతో ఉన్న ఎమ్మెల్యేల కంటే తన వద్దే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారని... ఈ నేపథ్యంలో పార్టీ అధినేతగా ఠాక్రేను తొలగించి, తనను నాయకుడిగా గుర్తించాలని ఆయన అంటున్నారు. ఇదే విషయాన్ని ఈసీ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ అంశంపై ఎన్నికల కమిషన్ కూడా స్పందించింది.

Shiv Sena : శివసేన ఎవరి సొంతం?

Shiv Sena

Shiv Sena : శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేపై తిరుగుబావుటా ఎగరేసిన ఏక్‌నాథ్‌ షిండే… ఇప్పుడు ఆ పార్టీనే చీల్చేశారు. బీజేపీ అండతో సీఎం పీఠాన్ని అధిరోహించిన ఆయన… వివిధ మున్సిపల్‌ కార్పొరేషన్లలో శివసేన కార్పొరేటర్లను తన గూటికి చేర్చుకుంటున్నారు. దీనికి తోడు శివసేన ఎంపీలు సైతం ఆయనకు టచ్‌లో ఉన్నారు.

మరోవైపు శివసేన పార్టీ తమదేనని షిండే క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఉద్ధవ్‌ ఠాక్రేతో ఉన్న ఎమ్మెల్యేల కంటే తన వద్దే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారని… ఈ నేపథ్యంలో పార్టీ అధినేతగా ఠాక్రేను తొలగించి, తనను నాయకుడిగా గుర్తించాలని ఆయన అంటున్నారు. ఇదే విషయాన్ని ఈసీ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ అంశంపై ఎన్నికల కమిషన్ కూడా స్పందించింది.

Maharashtra: శివసేన పార్టీ ఎవ‌రిది?.. ప‌త్రాలు స‌మ‌ర్పించాల‌ని ఈసీ ఆదేశం

మెజార్టీని నిరూపించుకునేందుకు అవసరమైన డాక్యుమెంట్లను ఆగస్ట్ 8లోగా తమకు అందజేయాలని ఇరు పక్షాలను ఈసీ కోరింది. డాక్యుమెంట్లు అందిన తర్వాత ఈ అంశంపై విచారణ జరుపుతామని తెలిపింది. ఈసీ సూచనల మేరకు ఇరు పక్షాలు తమ స్టేట్మెంట్లను రాతపూర్వకంగా ఇవ్వాల్సి ఉంటుంది.

కాగా, ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం త్వరలోనే పడిపోతుందని, మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు వస్తాయంటూ శివసేన నేత ఆదిత్య ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి అనారోగ్యంతో ఉన్న సమయంలో శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు.. ఆయనకు ద్రోహం చేశారని ఆదిత్య ఠాక్రే మండిపడ్డారు.