Karnataka Polls: సిట్టింగులను ఎత్తేసిన బీజేపీ.. అమిత్ షా సమాధానం ఏంటంటే?

వచ్చే నెల 10వ తేదీన కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికల పోలింగ్ జరగనుంది. అయితే టికెట్ రాని బీజేపీ నేతలు పెద్ద ఎత్తున పార్టీ మారుతున్నారు. మాజీ సీఎం జగదీశ్‌ షెట్టర్‌, మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్‌ సవాది వంటి వారికి టికెట్‌ నిరాకరించారు. దీంతో వారు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

Karnataka Polls: సిట్టింగులను ఎత్తేసిన బీజేపీ.. అమిత్ షా సమాధానం ఏంటంటే?

Amit Shah

Karnataka Polls: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి చెందిన కొంత మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ దక్కలేదు. ఈ విషయమై ఎమ్మెల్యేల్లో తీవ్ర అసహనం నెలకొంది. కొందరు దీనిపై స్పందించేందుకు అంత ఇష్టం చూపకపోతుండగా.. కొందరేమో రాజకీయ దుమారానికి ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి అయితే.. ఈ నిర్ణయం మీద బీజేపీ అధిష్టానంపై పార్టీ నేతల నుంచే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాన్ని కేంద్ర హోంమంత్రి, బీజేపీ కీలక నేత అమిత్ షా వెల్లడించారు.

Satya Pal Malik: పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన సత్యపాల్ మాలిక్.. చర్చనీయాంశంగా మారిన ఆయన తీరు

ఇండియా టుడే నిర్వహించిన ‘ఇండియా టుడే కర్ణాటక రౌండ్‌టేబుల్ 2023’లో పాల్గొన్న ఆయన.. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వకపోవడంపై స్పందిస్తూ తమ పార్టీ ఎప్పుడూ మార్పును కోరుకుంటుందని, అందుకే కొంతమందికి టికెట్లు రాలేదని అన్నారు. వచ్చే నెల 10వ తేదీన కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికల పోలింగ్ జరగనుంది. అయితే టికెట్ రాని బీజేపీ నేతలు పెద్ద ఎత్తున పార్టీ మారుతున్నారు. మాజీ సీఎం జగదీశ్‌ షెట్టర్‌, మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్‌ సవాది వంటి వారికి టికెట్‌ నిరాకరించారు. దీంతో వారు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

Maharashtra: ‘మహా’ గందరగోళం.. సీఎం కుర్చీ కోసం 2024 వరకు ఆగలేనంటున్న అజిత్ పవార్

అయితే తమ పార్టీ నేతలు వేరే పార్టీకి వలస వెళ్లినప్పటికీ ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధిస్తుందని అమిత్ షా అన్నారు. “షెట్టర్ తమతో జతకట్టడం వల్ల ఎన్నికల్లో గెలుస్తామని కాంగ్రెస్ భావిస్తే, కనీసం ఒంటరిగా గెలవలేమని వారు అంగీకరిస్తున్నట్టే. పైగా కాంగ్రెస్‌లో చేరింది కేవలం షెట్టర్ మాత్రమే. బీజేపీ ఓట్లు కాదు. కనీసం ఆయనతో కార్యకర్తలు కూడా ఎవరూ వెళ్లలేదు. ఇలాంటి చేరికల వల్ల బీజేపీ చెక్కుచెదరలేదు. ఈ ఎన్నికల్లో మేము భారీ మెజారిటీతో అధికారంలోకి తిరిగి వస్తాము’’ అని అమిత్ షా అన్నారు.