Satya Pal Malik: పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన సత్యపాల్ మాలిక్.. చర్చనీయాంశంగా మారిన ఆయన తీరు

Satya Pal Malik: సీబీఐ నోటీసులు అందిన వేళ సత్యపాల్ మాలిక్ ఇలా పోలీస్ స్టేషన్ కు ఎందుకు వెళ్లారు?

Satya Pal Malik: పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన సత్యపాల్ మాలిక్.. చర్చనీయాంశంగా మారిన ఆయన తీరు

Satya Pal Malik

Updated On : April 22, 2023 / 4:08 PM IST

Satya Pal Malik: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ తీరుపై సంచలన వ్యాఖ్యలు చేసి కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) మాజీ గవర్నర్‌ సత్యపాల్ మాలిక్ (Satya Pal Malik)‭ ఇవాళ ఢిల్లీ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అవినీతి కేసులో ఆయనకు కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) సమన్లు పంపిన నేపథ్యంలో పోలీస్ స్టేషన్ కు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

దీంతో ఆయనను అరెస్టు చేయలేదని ఢిల్లీలోని అర్కే పురం పోలీసులు ప్రకటన చేయాల్సి వచ్చింది. కొన్ని సొంత పనుల మేరకే సత్యపాల్ మాలిక్ ఆయన మద్దతుదారులతో కలిసి పోలీస్ స్టేషన్ కు వచ్చాడని పోలీసులు స్పష్టం చేశారు. విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం… సత్యపాల్ మాలిక్ తన ఇంటి సమీపంలో ఓ పార్క్ లో సమావేశం ఏర్పాటు చేయాలనుకున్నారు.

అందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే సత్యపాల్ మాలిక్ తన మద్దతుదారులతో కలిసి పోలీస్ స్టేషన్ కు వచ్చినట్లు తెలుస్తోంది. నివాస ప్రాంతంలో సమావేశం ఏర్పాటు చేయాలనుకున్నారని, అందుకే తాము అందుకు అనుమతి ఇవ్వలేదని పోలీసులు చెప్పారు. ఉత్తరప్రదేశ్, హరియాణా రైతు సంఘాలు ఆ సమావేశంలో పాల్గొనాల్సి ఉన్నట్లు తెలుస్తోంది.

సత్యపాల్ మాలిక్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన సమయంలో ఆ రైతుల సంఘాల నేతలు కూడా ఆయనతో పాటు ఉన్నారు. తమను అరెస్టు చేస్తామని పోలీసులు అంటున్నారని సత్యపాల్ మాలిక్ మద్దతుదారుల్లో ఒకరు మీడియాకు తెలిపారు. కాగా, ఏప్రిల్ 28న రిలయన్స్ జనరల్ ఇన్సురెన్స్ కేసులో సాక్షిగా సీబీఐ ముందు సత్యపాల్ మాలిక్ హాజరుకావాల్సి ఉంది.


Rahul Gandhi: 18 ఏళ్ల తర్వాత అధికారిక బంగళా ఖాళీ చేసిన రాహుల్ గాంధీ