Maharashtra: ‘మహా’ గందరగోళం.. సీఎం కుర్చీ కోసం 2024 వరకు ఆగలేనంటున్న అజిత్ పవార్

ముఖ్యమంత్రి పదవిపై అజిత్ పవార్ మనసులోని మాటను వెల్లడించారు. తాను ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అయితే అందుకోసం 2024 లో జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ఎదురు చూసే సమయం తనకు లేదని ఆయన అనడం గమనార్హం. నూటికి నూరు శాతం తాను ముఖ్యమంత్రి అవుతానని అజిత్ పవార్ స్పష్టం చేశారు

Maharashtra: ‘మహా’ గందరగోళం.. సీఎం కుర్చీ కోసం 2024 వరకు ఆగలేనంటున్న అజిత్ పవార్

Ajit Pawar

Updated On : April 22, 2023 / 4:22 PM IST

Maharashtra: మహారాష్ట్రలో రాజకీయం ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాదు. ఊహించని పరిణామాలు, అతి తక్కువ సమయంలో జరిగిపోతుంటాయి. ఓడలు బల్లు అవుతుంటాయి, బల్లు ఓడలవుతుంటాయి. కొద్ది రోజుల క్రితమే మహారాష్ట్ర ప్రాంతీయ పార్టీ అయిన శివసేన చీలిపోయింది. చీలిపోయిన ఒక వర్గం భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు వారికే ఉండడంతో పార్టీ కూడా ఆ వర్గానికే దక్కింది. ఇకపోతే, రాష్ట్రంలో మరో బలమైన ప్రాంతీయ పార్టీ అయిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి సైతం అలాగే కనిపిస్తోంది.

Addanki Dayakar: ఈటల భాగ్యలక్ష్మి టెంపుల్‌కు రాకుంటే రాజకీయ వ్యభిచారిగా మిగిలిపోతారు

శరద్ పవార్ అనంతరం పార్టీలో బలమైన నేతగా ఉన్న అజిత్ పవార్.. పార్టీ నుంచి విడపోనున్నారా? కొంత మంది ఎమ్మెల్యేలతో కలిసి పార్టీని చీల్చనున్నారా? అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. నాలుగు రోజుల క్రితమే ప్రారంభమైన ఈ చర్చపై శరద్ పవార్ సహా అజిత్ పవర్ సైతం సమాధానం ఇచ్చారు. అజిత్ ఎప్పటికీ ఎన్సీపీతోనే ఉంటారని స్పష్టం చేశారు. అయితే ఇవి అంత నమ్మశక్యంగా అయితే కనిపించడం లేదు. రోజులు గడుస్తున్నా కొద్ది పరిస్థితుల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.

Encounter : మధ్యప్రదేశ్ బాలాఘాట్ లో ఎన్ కౌంటర్.. ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి

తాజాగా ముఖ్యమంత్రి పదవిపై అజిత్ పవార్ మనసులోని మాటను వెల్లడించారు. తాను ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అయితే అందుకోసం 2024 లో జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ఎదురు చూసే సమయం తనకు లేదని ఆయన అనడం గమనార్హం. నూటికి నూరు శాతం తాను ముఖ్యమంత్రి అవుతానని అజిత్ పవార్ స్పష్టం చేశారు. దీంతో ఎన్సీపీ అజిత్ పవార్ చీల్చబోతున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. దీనికి తోడు తాజాగా జరిగిన పార్టీ కార్యక్రమంలో అజిత్ పవార్ పాల్గొనలేదు. కారణం అడిగితే, తనకు వేరే ముఖ్యమైన పనులు ఉండడం వల్ల హాజరు కాలేదని స్పష్టం చేశారు. ఇవన్నీ పార్టీ మీద పలు అనుమానాలకు తావునిస్తున్నాయి.

Rahul Gandhi: 18 ఏళ్ల తర్వాత అధికారిక బంగళా ఖాళీ చేసిన రాహుల్ గాంధీ

అయితే, ప్రస్తుత పరిణామాలన్నింటినీ గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎన్సీపీ ఎత్తుగడులు ఇలాగే ఉంటాయని కూడా వారు జోస్యం చెబుతున్నారు. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాలను ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీకి మద్దతు ఇస్తామని శరద్ పవార్ ఎన్నికల ఫలితాల అనంతరమే ప్రకటించారు. అయితే శరద్ పవార్.. విపక్షాల స్టాండు తీసుకోగా.. బీజేపీకి అజిత్ పవార్ మద్దతు ఇచ్చారు. అనంతరం దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బలపరీక్షలో ప్రభుత్వం ఓడిపోయి ఇద్దరు రాజీనామా చేశారు.

PM Modi : ప్రధాని పర్యటనలో ఆత్మాహుతి దాడులు తప్పవని లేఖ .. కేరళలో హైఅలర్ట్‌

ఇప్పటి పరిస్థితులు కూడా అలాగే కనిపిస్తున్నాయని అంటున్నారు. ఒక్కసారిగా వ్యాపారవేత్త గౌతమ్ అదానీతో శరద్ పవార్ భేటీ అయ్యారు. పైగా అదానీ గురించి కాస్త సానుకూలంగా స్పందించారు. ఇక మరొకవైపు బీజేపీ మీద అజిత్ పవార్ ప్రత్యక్షంగా పొగడ్తలు కురిపిస్తున్నారు. మరి ఈ తాజా రాజకీయ క్రీడ ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.