Up Election 2022 : అఖిలేశ్ పార్టీకి టీఎంసీ మద్దతు ..

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ పోటీపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ క్లారిటీ ఇచ్చారు. ఈ ఎన్నిల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. అఖిలేశ్ యాదవ్‌కు...

Up Election 2022 : అఖిలేశ్ పార్టీకి టీఎంసీ మద్దతు ..

Mamata

SP Chief Akhilesh Yadav : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ పార్టీలు తమ దూకుడును పెంచాయి. అధికారం కైవసం చేసుకునేందుకు పదునైనా వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కర్హల్ స్థానం నుంచి తొలి సారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగారు. అయితే ఆయనపై కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని పోటీకి దించడం లేదు. ఇది కేవలం మర్యాద పూర్వకమైన నిర్ణయమని కాంగ్రెస్ తెలిపింది. ఇక ఇలాంటి సమయంలో అఖిలేశ్‌ పార్టీకి టీఎంసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

Read More : New Zealand : అప్పటివరకూ.. న్యూజిలాండ్‌లో విదేశీయులకు నో ఎంట్రీ..!

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ పోటీపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ క్లారిటీ ఇచ్చారు. ఈ ఎన్నిల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. అఖిలేశ్ యాదవ్‌కు తమ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు దీదీ ప్రకటించారు. యూపీలో బీజేపీని తరిమి కొట్టేందుకే తమ మద్దతు ఎస్పీకి ఇస్తున్నట్లు తెలిపారు. టీఎంసీ కార్యకర్తలు సమాజ్ వాదీ పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం టీఎంసీ ఉత్తరప్రదేశ్‌లో పోటీ చేస్తుందని దీదీ స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు అన్ని కలిసి బీజేపీని ఓడించాలని పిలుపు ఇచ్చారు. ఇప్పటికే తమ పార్టీతో బీజేపీకి చెందిన ఎనిమిది మంది కీలక నేతలు టచ్‌లో ఉన్నారన్నారు.

Read More : Srivalli Song : పుష్ప , శ్రీవల్లీలని అచ్చు దింపేసిన బాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్, హీరోయిన్

సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో నాలుగు బీజేపీ పాలిత రాష్ట్రాలే ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో అధికారం నిలబెట్టుకోవడంతో పాటు పంజాబ్‌లోనూ విజయం సాధించి.. సార్వత్రిక సమరానికి సిద్ధమవ్వాలని కమలనాధులు భావిస్తుండగా బీజేపీని ఢీకొట్టేందుకు రాజకీయ పార్టీలు సిధ్దంగా ఉన్నాయి. 2022 మేలో ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ గడువు ముగుస్తుంది. మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో గెలుపు బీజేపీకి అత్యవసరం. ఓ రకంగా యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ పాలనపై ప్రజలు ఇచ్చే తీర్పు.. సార్వత్రిక ఎన్నికల గమనాన్ని నిర్దేశించనుంది. యూపీలో నామినేటడ్ స్థానంతో కలిపి మొత్తం 404 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజార్టీ 202.

Read More : Sarath Kumar : సీనియర్ నటుడు శరత్ కుమార్‌కి మరోసారి కరోనా

– మొత్తం స్థానాలు 404
– ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన స్థానాలు 202
– అధికారంలో బీజేపీ
– బీజేపీకి 303 స్థానాలు
– ఎస్పీకి 49 స్థానాలు

Read More : Telangana : బండి సంజయ్ అరెస్టు వ్యవహారం, ప్రివిలేజ్ కమిటీ ముందుకు ఉన్నతాధికారులు

– బీఎస్పీకి 15 స్థానాలు
– కాంగ్రెస్‌కు 7 స్థానాలు
– ఒంటరిగా పోటీచేస్తున్న బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ
– మిత్రపక్షాలతో కలిసి పోటీచేస్తున్న ఎస్పీ