Wipro CEO Salary: భారత ఐటీ రంగంలో అత్యధిక వేతనం అందుకునేది అతనే.. ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం..

ఐటీ రంగం అంటేనే అత్యధిక వేతనాలు గుర్తుకు వస్తాయి. ప్రముఖ ఐటీ కంపెనీల్లో పనిచేసే చిన్నపాటి ఉద్యోగికి లక్షల్లో నెలవారి వేతనం ఉంటుంది. అయితే ఐటీ కంపెనీలు సాధారణంగా తమ కంపెనీలో పనిచేసే సీఈఓల వేతనాలు బహిర్గతం చేయవు. కానీ ఇటీవల పలు కంపెనీలు సీఈవో, ఎండీలు అందుకుంటున్న ప్యాకేజీలను వార్షిక రిపోర్టులలో వెల్లడిస్తున్నారు.

Wipro CEO Salary: భారత ఐటీ రంగంలో అత్యధిక వేతనం అందుకునేది అతనే.. ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం..

Wipro

Wipro CEO: ఐటీ రంగం అంటేనే అత్యధిక వేతనాలు గుర్తుకు వస్తాయి. ప్రముఖ ఐటీ కంపెనీల్లో పనిచేసే చిన్నపాటి ఉద్యోగికి లక్షల్లో నెలవారి వేతనం ఉంటుంది. అయితే ఐటీ కంపెనీలు సాధారణంగా తమ కంపెనీలో పనిచేసే సీఈఓల వేతనాలు బహిర్గతం చేయవు. కానీ ఇటీవల పలు కంపెనీలు సీఈవో, ఎండీలు అందుకుంటున్న ప్యాకేజీలను వార్షిక రిపోర్టులలో వెల్లడిస్తున్నారు. ప్రముఖ కంపెనీల సీఈవోల వేతనాలు కోట్లలోనే ఉంటాయి. టాప్ వన్, టూలో నిలిచిన కంపెనీలు తమ సీఈవోలకు ఇచ్చే వేతనాలు చూస్తే మనం నోరెళ్లబెట్టాల్సిందే.ౌ

IT Employees : ఐటీ ఉద్యోగులకు గుడ్ టైమ్ మొదలైంది?

ఇటీవల ఐటీ కంపెనీల సీఈవోల జీతాలను ఆయా కంపెనీలు బహిరంగంగానే వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో భారత ఐటీ రంగంలో అత్యధిక వేతనం అందుకుంటున్న వారిలో విప్రో సీఈవో థియరీ డెలాపోర్ట్ ఉన్నారు. ఆయన 2022 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.79.8 కోట్లను(10.51 మిలియన్ డాలర్లు) పొందినట్లు కంపెనీ తన వార్షిక రిపోర్టులో తెలిపింది. ఈ వార్షిక రిపోర్టును విప్రో అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్‌కు సమర్పించింది.

Char Dham Yatra 2022: ఒక్క నెలలో చార్‌ధామ్ పుణ్యక్షేత్రాలను ఎంత మంది దర్శించుకున్నారో తెలుసా..

2020-21 ఆర్థిక సంవత్సరంలో డెలాపోర్టో వార్షిక వేతనం రూ. 64.3 కోట్లు (8.7 మిలియన్ డాలర్లు). అతను జూలై 2020లో మాత్రమే కంపెనీలో చేరినందున పరిహారం తొమ్మిది నెలలది మాత్రమే వచ్చింది. బెంగళూరుకు చెందిన కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ 1.74 మిలియన్ డాలర్లు (రూ. 13.2 కోట్లు) జీతం, అలవెన్సులు 2.55 మిలియన్ డాలర్లు (రూ. 19.3 కోట్లు) కమీషన్లు, వేరియబుల్ పేలో, ఇతర ప్రయోజనాల పరంగా 4.2 మిలియన్ డాలర్లు (రూ. 31.8 కోట్లు) తీసుకున్నారు. దీర్ఘకాలిక పరిహారం, వాయిదాపడిన ప్రయోజనాలు మిగిలే ఉన్నాయి.

Hindus in Pakistan: పాకిస్థాన్‌లో ఎన్ని లక్షల మంది హిందువులు నివసిస్తున్నారో తేల్చిన ఎన్ఏడీఆర్ఏ నివేదిక

– ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ ఫరేఖ్ వేతనం 43శాతం పెరిగి రూ.71 కోట్లకు చేరుకుంది.
– టీసీఎస్ సీఈవో రాజేష్ గోపీనాథన్ వార్షిక ప్యాకేజీ రూ. 25.77 కోట్లుగా ఉంది. ఇది గత నెలలో ప్రచురించబడిన వార్షిక నివేదిక ప్రకారం 27% పెరిగింది.
– విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ గత ఏడాది 1.62 మిలియన్ డాలర్లు తీసుకోగా.. ప్రస్తుతం 1.82 మిలియన్ డాలర్లను అదుకుంటున్నారు. అయితే రూపాయిల్లో చూసుకుంటే గత ఏడాది రూ.11.8 కోట్ల నుంచి రూ.13.8 కోట్లకు వార్షిక వేతనం పెరిగింది.