Employees Resign: ఆఫీస్‌కొచ్చి పనిచేయమన్న యాజమాన్యం.. 800 మంది ఉద్యోగులు రాజీనామా..!

కరోనా మహమ్మారి కారణంగా సాఫ్ట్ వేర్, ఇతర రంగాల్లోని కార్యాలయాలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసుకొనే అవకాశాన్ని కల్పించాయి. దాదాపు ఈ ప్రక్రియ రెండేళ్లుగా కొనసాగుతుంది. ఉద్యోగులు ఇంటి వద్దనే ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు...

Employees Resign: ఆఫీస్‌కొచ్చి పనిచేయమన్న యాజమాన్యం.. 800 మంది ఉద్యోగులు రాజీనామా..!

Employees Resign

Employees Resign: కరోనా మహమ్మారి కారణంగా సాఫ్ట్ వేర్, ఇతర రంగాల్లోని కార్యాలయాలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసుకొనే అవకాశాన్ని కల్పించాయి. దాదాపు ఈ ప్రక్రియ రెండేళ్లుగా కొనసాగుతుంది. ఉద్యోగులు ఇంటి వద్దనే ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా భారత్ లో కొవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. దేశంలో 2,500 నుంచి 3వేల వరకు కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్ ఆంక్షలను సైతం కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో పలు సంస్థల యాజమాన్యాలు ఉద్యోగులను కార్యాలయాలకు రావాలని ఆదేశిస్తున్నాయి. ఇప్పటికే పలువురు ఉద్యోగులు పట్టణాలకు చేరుకొని తమ కార్యాలయాలకు వెళ్లి పనిచేస్తున్నారు.

BJP Workers-Farmers Clash : రైతులు-బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

ముంబైకి చెందిన కోడింగ్‌ లెర్నింగ్‌ స్టార్టప్‌ కంపెనీ ‘వైట్‌హ్యాట్‌ జేఆర్‌’ కు చెందిన 800 మంది ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి పనిచేయమన్నందుకు రాజీనామా చేసినట్లు తెలిసింది. ఐఎన్‌సీ42 ఎక్స్ క్లూజివ్ నివేదిక ప్రకారం వైట్‌హ్యాట్‌ జేఆర్‌ ను ఎడ్ టెక్ దిగ్గజం బైజూస్ 2020లో 300 మిలియన్లకు కొనుగోలు చేసింది. దేశంలో కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో ఒక నెల వ్యవధిలో ఉద్యోగులందరూ ఆఫీస్ కు వచ్చి పనిచేయాలని సంస్థ ఈ మెయిల్ ద్వారా కోరింది. అయితే కార్యాలయాలకు వచ్చేందుకు ఉద్యోగులు ఇష్టపడటం లేదు.

Work From Office : ఆఫీసుకు వచ్చి పనిచేయమన్న యాపిల్-రాజీనామా చేసిన డైరెక్టర్

అధిక శాతం మంది తాము కార్యాలయాలకు ఇప్పట్లో రామని స్పష్టం చేశారు. సుమారు 800 మంది ఉద్యోగులు ఏకంగా రాజీనామానే చేశారు. వీరిలో సేల్స్, కోడింగ్, గణితం వంటి రంగాల్లో ఉద్యోగులు ఉన్నారు. ఐఎన్ సీ-42 నివేదిక ప్రకారం.. కొంతమంది ఉద్యోగులు ఇంటివద్ద నుండి ఉద్యోగాలు చేయడం ఖర్చు తగ్గించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కొంత మంది పునరావాసం కోసం కేవలం ఒక నెల సమయం ఇవ్వడం సరిపోదని, ఖరీదైన నగరాలకు వెళ్లడానికి సంస్థ తమ వేతనాన్ని పెంచాలని అన్నారు.