Putin War : అప్పటివరకు యుక్రెయిన్‌పై యుద్ధం ఆగదు.. తేల్చి చెప్పిన పుతిన్

దాడులపై రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin War) కీలక వ్యాఖ్యలు చేశారు. యుక్రెయిన్‌ ఆయుధాలు వీడే వరకూ తమ సైనిక చర్య ముగియదని మరోసారి స్పష్టం చేశారు.

Putin War : అప్పటివరకు యుక్రెయిన్‌పై యుద్ధం ఆగదు.. తేల్చి చెప్పిన పుతిన్

Putin Invasion

Putin War : వరుసగా 11వ రోజు కూడా యుక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగాయి. యుక్రెయిన్ పై రష్యా సేనలు బాంబుల వర్షం కురిపించాయి. అటు యుక్రెయిన్ సేనలు కూడా తీవ్రంగానే ప్రతిఘటిస్తున్నాయి. ఇరు దేశాల దాడుల్లో వేల మంది సైనికులతోపాటు పౌరులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఓవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు యుక్రెయిన్‌ నగరాలపై విరుచుకుపడుతోంది రష్యా.

ఈ నేపథ్యంలో దాడులపై రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌ ఆయుధాలు వీడే వరకూ తమ సైనిక చర్య ముగియదని మరోసారి స్పష్టం చేశారు పుతిన్(Putin War). యుక్రెయిన్‌ లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న వేళ కాల్పుల విరమణ పాటించాలని టర్కీ అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోవాన్‌ చేసిన విజ్ఞప్తికి రష్యా అధ్యక్షుడు ఈ విధంగా స్పందించారు. కీవ్‌ పోరాటాన్ని నిలిపివేసే వరకూ రష్యా సైన్యం వెనక్కితగ్గే ప్రసక్తే లేదని వ్లాదిమిర్‌ పుతిన్‌ తేల్చి చెప్పారు.

యుక్రెయిన్‌లో నెలకొన్న తాజా పరిస్థితులపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మేక్రాన్‌ మరోసారి చర్చలు జరిపారు. సైనిక చర్య ప్రారంభమైనప్పటి నుంచి పుతిన్‌తో మేక్రాన్‌ చర్చించడం ఇది నాలుగోసారి. అయినప్పటికీ రష్యా అధ్యక్షుడు వెనక్కి తగ్గే అవకాశాలు కనిపించడం లేదని తెలుస్తోంది.

Third World War : మూడవ ప్రపంచ యుధ్ధం వస్తుందా…?

కాగా, యుక్రెయిన్‌ నుంచి పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు వీలుగా రెండు దేశాల సైన్యం కాల్పులు విరమణకు అంగీకరించినప్పటికీ అమల్లో మాత్రం కనిపించడం లేదు. ‘హ్యుమానిటేరియన్‌ కారిడార్‌’కు రెండోరోజూ ఆటంకం ఏర్పడింది. మరియుపొల్‌, వోల్నవాఖ నగరాల్లో కాల్పుల విరామం ఉంటుందని ప్రకటించిన రష్యా.. మళ్లీ దాడులకు దిగుతోందని యుక్రెయిన్‌ ఆరోపించింది. దీంతో తరలింపు ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు మరియుపొల్‌ అధికారులు తెలిపారు. మరోవైపు విదేశీయుల సురక్షిత తరలింపు సహా అన్ని అంశాలపై మూడో విడత చర్చలకు తాము సిద్ధమని రష్యా విదేశాంగ తెలిపింది. దీంతో సోమవారం మూడో విడత చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది.

మరోవైపు రష్యాపై రష్యా ఆయుధాలతోనే యుద్ధం చేసేందుకు యుక్రెయిన్ వ్యూహం రచిస్తోంది. రష్యా విమానాలను రష్యా తయారీ విమానాలతో కూల్చేయాలన్న ప్లాన్ చేస్తోంది యుక్రెయిన్. రష్యా మిగ్‌ యుద్ధ విమానాలను నాటో దేశాల నుంచి యుక్రెయిన్ సమకూర్చుకుంటోంది. అమెరికా చట్టసభ సభ్యులను ఉద్దేశించి మాట్లాడిన జెలెన్‌స్కీ…. తమకు యుద్ధ విమానాలు అందిస్తే రష్యాను గట్టిగా ఎదుర్కొంటామన్నారు.

Russia Ukraine War : పుతిన్ కు కోపమొచ్చింది…రష్యాపై ఆంక్షలతో డెడ్లీ వార్నింగ్

యుక్రెయిన్‌పై దండయాత్ర మొదలు పెట్టిన రోజే రష్యా తమ ఎయిర్‌ డిఫెన్స్‌ను ధ్వంసం చేసిందని ఇప్పుడు తమకు అమెరికా సాయం కావాలని జెలెన్‌స్కీ కోరారు. వేరే యుద్ధ విమానాలను తమ పైలెట్లు నడపలేరు కాబట్టి తమకు మిగ్‌ విమానాలను ఇవ్వాలని కోరారు. దీంతో ఏం చేయాలనే దానిపై అమెరికా దృష్టి పెట్టింది. పోలెండ్‌ నుంచి యుక్రెయిన్‌కు యుద్ధ విమానాలను బదలాయించే అంశంపై వైట్‌హౌస్‌ దృష్టిపెట్టింది. పోలెండ్‌ దగ్గర రష్యా తయారీ మిగ్‌, సుఖోయ్‌ యుద్ధ విమానాలున్నాయి.