Haryana CM : పద్మశ్రీ అవార్డుతో సీఎం ఇంటి ముందు నిరసన

తాను పొందిన...అర్జున అవార్డు, పద్మ పురస్కారం..ఇతర మెడల్స్ తీసుకొచ్చి...న్యాయం చేయాలంటూ..డిమాండ్ చేశారు. ఆయన ఇంటి ఎదుట ధర్నా చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Haryana CM : పద్మశ్రీ అవార్డుతో సీఎం ఇంటి ముందు నిరసన

Padma

Wrestler Virendra Singh : పద్మశ్రీ అవార్డుతో సీఎం ఇంటి ముందు…ఓ క్రీడాకారుడు ధర్నా చేయడం సంచలనం రేకేత్తించింది. తాను పొందిన…అర్జున అవార్డు, పద్మ పురస్కారం..ఇతర మెడల్స్ తీసుకొచ్చి…న్యాయం చేయాలంటూ..డిమాండ్ చేశారు. ఆయన ఇంటి ఎదుట ధర్నా చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆయన చేస్తున్న డిమాండ్లను పరిష్కరించాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఘటన…హర్యానా రాష్ట్రంలో చోటు చేసుకుంది. ధర్నా చేసిన క్రీడాకారుడు పారా రెజ్లర్ వీరేందర్ సింగ్. ఇతను మంగళవారం నాడు రాష్ట్రపతి భవన్ లో అవార్డుల ప్రధానోత్సవంలో…పద్మీశ్రీ అవార్డు అందుకున్నారు.

Read More : T20 World Cup 2021 : వరల్డ్ కప్‌లో ఫస్ట్ టైమ్.. ఫైనల్‌ చేరిన న్యూజిలాండ్

2021, నవంబర్ 10వ తేదీ బుధవారం హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఇంటి ఎదుట వీరేందర్ సింగ్ ప్రత్యక్షమయ్యారు. సూటు..బూటు వేసుకుని…అర్డున అవార్డు, పద్మ పురస్కారం…ఇతర మెడల్స్ పట్టుకుని..ఆయన ఇంటి ముందు కూర్చొన్నారు. సీఎం ఇంటి ఎదుట ఎందుకు కూర్చొన్నారనే విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. కేంద్రం..పారా అథ్లెట్లకు సమాన హక్కులు కల్పిస్తున్నప్పుడు…హర్యానా ప్రభుత్వం…ఎందుకు ఇవ్వడం లేదనే విషయాన్ని ఆయన ప్రశ్నించారు.

Read More : జగన్ వీరవిధేయుడికి మళ్ళీ ఛాన్స్ _ Sajjala Ramakrishnareddy Announced Ycp MLC Candidates

బధిర క్రీడాకారులకు పారా క్రీడాకారులతో సమాన హక్కులు కల్పించేంత వరకు ఢిల్లీ హర్యానా భవన్ ఫుట్ పాత్ నుంచి వదలనని స్పష్టం చేశారాయన. మరోవైపు…హర్యానా రాష్ట్రం నుంచి.. పారా రెజ్లర్ వీరేందర్ సింగ్ కు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల సీఎం ఖట్టర్ హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు…సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు. ప్రస్తుతం క్రీడాకారుడు పారా రెజ్లర్ వీరేందర్ సింగ్ లేపట్టిన డిమాండ్స్ పరిష్కరిస్తారా ? లేదా ? అనేది చూడాలి.